Telangana: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఆర్టీసీలో 3,305 ఉద్యోగాలు!

తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్‌ గుడ్‌ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ సంస్థలో తర్వలో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. మొత్తం 3,305 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 2 వేల డ్రైవర్ ఉద్యోగాలు, 743 శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి.

New Update
Telangana: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఆర్టీసీలో 3,305 ఉద్యోగాలు!

తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్‌ శుభవార్త తెలిపింది. ఆర్టీసీ సంస్థలో తర్వలో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. మొత్తం 3,305 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 2 వేల డ్రైవర్ ఉద్యోగాలు, 743 శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీకి పర్మిషన్ రావడంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ హర్షం వ్యక్తం చేశారు. కొత్త రక్తంతో ఆర్టీసీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ 3,305 ఉద్యోగాలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

నోటిఫికేషన్లో పోస్టుల వారీగా అర్హతలు, వేతనం, దరఖాస్తు తేదీలు ఉండనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం ఇదే తొలిసారి. మహాలక్ష్మి స్కీమ్ తో భారీగా డిమాండ్ పెరగడంతో బస్సులను పెంచాలని ఆర్టీసీ భావిస్తోంది. ఇందుకోసం కొత్త బస్సులను కొనుగోలు చేయనుంది సంస్థ. ఈ నేపథ్యంలోనే నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

పోస్టుల వివరాలు:
డ్రైవర్లు: 2000
శ్రామిక్‌: 743
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) - 84
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్) - 114
సెక్షన్ ఇంజినీర్‌ (సివిల్): 11
అకౌంట్స్ ఆఫీసర్ - 6
అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ - 15
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) - 23
మెడికల్ ఆఫీసర్స్ (జనరల్) - 7
మెడికల్ ఆఫీసర్స్ (స్పెషలిస్ట్‌) - 7
డిపో మేనేజర్లు/అసిస్టెంట్ ట్రాఫిక్‌ మేనేజర్లు - 25

Advertisment
Advertisment
తాజా కథనాలు