Walking: కదలకుండా ఉండడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే నిద్రపోయే ముందు కొద్దిసేపు నడవడం ఆరోగ్యానికి మంచిదని చాలా మందికి తెలియదు. పడుకునే ముందు కాసేపు నడవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఈరోజు మనం దానిపై కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్ర మంచిది:
- ఆహారం తిన్న తర్వాత తేలికపాటి నడక చాలా ముఖ్యం. నిద్రపోయే ముందు తేలికపాటి నడకను తీసుకుంటే.. అది మీ నిద్ర విధానాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో మనసు ప్రశాంతంగా ఉండి మంచి నిద్ర వస్తుంది.
మానసిక ఆరోగ్య:
- సాయంత్రం నడక ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. ఇది మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా.. డిప్రెషన్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.
బరువు తగ్గుతారు:
- రోజూ నిద్రపోయే ముందు వాకింగ్ చేయడం వల్ల క్యాలరీలు కరిగిపోతాయి. ఇది బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యం:
- నిద్రపోయే ముందు రోజూ వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీంతోపాటు బీపీ కూడా అదుపులో ఉంటుంది.
కండరాలకు మంచిది:
- నడక కండరాలను, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కూడా అందిస్తుంది.
ఈవినింగ్ వాక్‌పై ప్రత్యేక శ్రద్ధ:
- రాత్రి భోజనం చేసిన 2 గంటల తర్వాత మాత్రమే నడక కోసం బయటకు వెళ్తే మంచిది. చాలా వేగంగా నడవకుడదు. సౌకర్యవంతమైన బట్టలు, బూట్లు వేసుకోవాలి. మీకు ఏవైనా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉంటే.. వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే నడకకు వెళ్లాలి. సాయంత్రం నడక జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది ఆహారం జీర్ణం కావడానికి కూడా చాలా సహాయపడుతుంది. కాబట్టి.. తిన్న వెంటనే నిద్రపోకూడదు. భోజనం చేసిన 2 గంటల తర్వాత 15 నిమిషాల పాటు నడక కూడా చేయాలని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: మతిమరుపు రావడానికి కారణాలివే.. డాక్టర్స్ చెబుతున్న వివరాలు తెలుసుకోండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.