Morning Health Tips: మార్నింగ్(Morning) లేచిన దగ్గర నుంచి నైట్(Night) నిద్రపోయేవరకు స్మార్ట్ ఫోన్ దగ్గర లేకపోతే పని జరగని పరిస్థితులు. ఆఖరికి నిద్రపోయే సమయంలో కూడా మొబైల్‌ను దిండు(Pillow) పక్కన పెట్టి పడుకోవడం చాలా మందికి అలవాటు. దాన్ని వల్ల వచ్చే రేడియేషన్స్, అవి మన మీద చూపించే ప్రభావం గురించి అందరికి తెలిసిందే. రాత్రి నిద్రపోయే ముందు మొబైల్‌ని చూస్తూ స్లీప్‌లోకి జారుకునే ప్రజలు.. ఉదయం లేవగానే కూడా అదే స్మార్ట్‌ఫోన్‌ని చూస్తూ లేస్తారు. చాలా మంది కళ్లు తెరవకముందే ఫోన్‌ని చేతిలోకి తీసుకొని..ఆ తర్వాత కళ్లు తెరుస్తారు..వెంటనే మొబైల్‌లో డేటా ఆన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల వచ్చే అనర్థాల గురించి తప్పక తెలుసుకోండి.
నిద్ర లేచిన గంటలోపు మీ ఫోన్ చెక్ చేయకుండా ఎందుకు ఉండాలో తెలుసా? దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి.
రీజన్-1: ఒత్తిడి, ఆందోళన
ఆఫీస్‌లో వంద పనులుంటాయి.. అవి మార్నింగ్ లేచిన దగ్గర నుంచే ఆలోచిస్తే హెల్త్ పాడవుతుంది. మేల్కొన్న వెంటనే ఫోన్ చూడడం వల్ల అందులోని మెసేజీలు, ఈమెయిల్స్, చేయవలసిన పనులు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఇది ఒత్తిడిని పెంచుతుంది.. పని జరుగుతుందో లేదోనన్న ఆందోళనను కలిగిస్తుంది. కాబట్టి.. మీరు మీ రోజును హడావిడిగా, ఒత్తిడిగా, ఆత్రుతగా ప్రారంభించకుండా ఉండాలనుకుంటే.. మేల్కొన్న వెంటనే మీ స్మార్ట్‌ఫోన్‌ని చెక్ చేయడం మానేయండి.
రీజన్-2: మీ సమయం హైజాక్ అవుతుంది.
మేల్కొన్న వెంటనే సోషల్ మీడియా, ఈమెయిల్ లేదా ఇతరుల వాట్సాప్ స్టేటస్‌లు చెక్ చేయడం వల్ల రోజు మంచిగా స్టార్ట్ ఐనట్టు అనిపించదు. మీరు ఇతరుల అభిప్రాయాలు మీ మనస్సులోకి అనుమతించినట్టు లెక్క.. ఇది మీ మైండ్‌ని పొల్యూట్ చేస్తుంది. మీరు చూసిన కొత్త మెసేజీలు, ఈమెయిల్స్, నోటిఫికేషన్ల ద్వారా మీ ఆలోచనలు అక్కడే ఉండిపోతాయి.. మీకు తెలియకుండానే మీ అమూల్యమైన టైమ్ వెస్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే.. మీ మనస్సు ఇతరుల ఆలోచనలతో నిండి పోయి ఉంటుంది.. మీ గురించి మీరు ఆలోచించుకోలేరు.
రీజన్-3: మైండ్ డైవర్ట్ అవుతుంది:
రేపు అది చేయాలి, ఈ పని పూర్తి చేయాలి.. ఎలాగైనా సిలబస్ కంప్లీట్ చేయాలి, ఆఫీస్‌లో వర్క్ త్వరగా ఫినిష్ చేయాలి లాంటివి ఆలోచిస్తూ ముందు రోజు రాత్రి నిద్రపోతాం. కానీ లేచిన వెంటనే ఇలా మొబైల్ పట్టుకోని సోషల్‌మీడియా లేదా ఈమెయిల్స్ ప్రపంచంలో మునిగిపోవడం వల్ల మైండ్ డైవర్ట్ అవుతుంది. పెట్టుకున్న గోల్స్, టార్గెట్లు గుర్తుకురావు.. ఒకవేళ వచ్చినా వాటికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాలనిపించదు. ఇది మన చదువు లేదా కెరీర్‌పై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది.
ఫైనల్‌గా తెలుసుకోవాల్సిందిదే:
మీ స్మార్ట్‌ఫోన్‌ని చెక్ చేయడానికి బదులుగా మీరు చేయగలిగే కనీసం విషయాల జాబితాను తయారు చేసుకోండి. వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం, బుక్స్ చదవడం, జర్నలింగ్, పాడ్ కాస్ట్‌ను వినడం, ఆరోగ్యకరమైన అల్పాహారం తయారు చేయడం, మీ పిల్లలు లేదా జీవిత భాగస్వామితో కనెక్ట్ అవ్వడం, లక్ష్యాలను నిర్దేశించడం లాంటివి ప్లాన్ చేసుకోండి. ఇలా చేసి చూడండి.. కచ్చితంగా మీ లైఫ్ అంతకముందు కంటే హ్యాపీగా అనిపిస్తుంది.
ALSO READ: షుగర్ పేషంట్లు జాగ్రత్త..ఈ వ్యాధి కంటిచూపును శాశ్వతంగా దూరంగా చేస్తుంది..!!
ALSO READ: శరీరంలో ఈ భాగాల్లో వచ్చే సమస్యలు గుండెపోటుకు కారణమని మీకు తెలుసా?