America: నార్త్‌ కరోలినాలో కాల్పులు..ముగ్గురు అధికారులు మృతి

నార్త్ కరోలినాలో సోమవారం యూఎస్‌ మార్షల్స్ టాస్క్‌ ఫోర్స్‌ కు చెందిన ముగ్గురు అధికారులను కాల్చి చంపారు. అక్రమ ఆయుధాల ఆరోపణలపై నేరస్థుడి కోసం అధికారులు అరెస్ట్ వారెంట్ ను జారీ చేశారు. ఈ కాల్పుల్లో మరో ఐదుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

author-image
By Bhavana
America: నార్త్‌ కరోలినాలో కాల్పులు..ముగ్గురు అధికారులు మృతి
New Update

America: నార్త్ కరోలినాలో సోమవారం యూఎస్‌ మార్షల్స్ టాస్క్‌ ఫోర్స్‌ కు చెందిన ముగ్గురు అధికారులను కాల్చి చంపారు. అక్రమ ఆయుధాల ఆరోపణలపై నేరస్థుడి కోసం అధికారులు అరెస్ట్ వారెంట్ ను జారీ చేశారు. ఈ కాల్పుల్లో మరో ఐదుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. షార్లెట్-మెక్లెన్‌బర్గ్ పోలీస్ చీఫ్ జానీ జెన్నింగ్స్ మాట్లాడుతూ.. షార్లెట్‌లోని అతని ఇంటికి చేరుకునేటప్పుడు అనుమానితుడు అధికారులు కాల్చి చంపారని చెప్పారు. రెండో వ్యక్తి ఇంటి లోపల నుంచి అధికారులపై కాల్పులు జరిపినట్లు తెలిపారు.

దాదాపు మూడు గంటల తరువాత ఆ ఇంట్లో ఒక మహిళ, 17 ఏళ్ల వ్యక్తి కనిపించారు. ఈ కాల్పుల్లో వాహనాలు ధ్వంసమయ్యాయి. అనుమానుతుల్ని ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు జెన్నింగ్స్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌లోని మరో సభ్యుడు కూడా గాయపడ్డాడు. ఒక ఏజెంట్ ని కాల్చి చంపినట్లు అధికారులు ధృవీకరించారు. కానీ ఇప్పటి వరకు ఎవరి పేరును విడుదల చేయలేదు.

ఘటనాస్థలికి స్పందించిన నలుగురు షార్లెట్-మెక్లెన్‌బర్గ్ అధికారులు కూడా గాయపడిన అధికారులను రక్షించే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని జెన్నింగ్స్ తెలిపారు.

Also read: వివాదంలో మహేశ్‌ బాబు..ఆ వీడియో తొలగించడంతో ..!

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe