Viral Post: పెద్దగా పని చేయకుండానే 3 కోట్ల జీతం–అమెజాన్ ఉద్యోగి పోస్ట్ ఏ పనీ చేయకుండానే మూడు కోట్ల జీతం తీసుకున్నాడు. అది కూడా అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలో. ఏడాదిగా కంపెనీలో కాలక్షేపం చేస్తున్నాడు. కానీ మంచిగా జీతం మాత్రం తీసుకున్నాడు. ఈ విషయాన్ని సదరు వ్యక్తే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు అది కాస్తా వైరల్‌గా మారింది. By Manogna alamuru 24 Aug 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Big Salary Without Doing Work: కొంతమంది పెద్దగా పని చేయరు..చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి లక్షల్లో జీతాలు సంపాదిస్తారు. అయితే వాళ్ళెవరూ బయటపడరు. ఇలాంటి వాళ్ళు బయట ప్రపంచానికి తెలియదు కానీ..కంపెనీల్లో పని చేస్తున్న వారితో మాట్లాడితే తెలుస్తుంది. ప్రతీ కంపెనీలో ఇలాంటి వారు కచ్చితంగా ఉంటారు. వీళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో వీళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. తమ పై ఆఫీసర్ల దగ్గర ఎలా ఉండాలో..ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో వీరికి వెన్నతో పెట్టిన విద్య. అలా ఏ పనీ చేయకుండానే ప్రమోషన్లు కొట్టేస్తారు. డబ్బులు సంపాదించేస్తుంటారు. ఇలాంటి వ్యక్తి రాసిన పోస్టే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అమెజాన్‌లో పని చేస్తున్న తాను ఏ ఉద్యోగం చేయకుండా 3 కోట్లు సంపాదించానని చెబుతున్నాడు సదరు ఉద్యోగి. బ్లైండ్ అనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో ఒకరు పోస్ట్ పెట్టారు. అతని పేరు ఏంటో తెలియకపోయినా...అతను చెప్పిన విషయం మాత్రం చాలా వైరల్ అయిపోయింది. బ్లైండ్‌లో అతను పెట్టిన పోస్ట్‌ను..మరొక వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో అది మరింత వైరల్ అయిపోయింది. ఇంతకీ సదరు ఉద్యోగి మని పెట్టాడంటే.. గూగుల్‌లో తనను ఉద్యోగం నుంచి తీసేశాక అమెజాన్‌లో టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్ గా చేరానని..జాయిన్ అయినప్పుడే పెద్దగా పని చేయకూడదని డిసైడ్ అయ్యానని రాశాడు. అందుకు తగ్గట్టే ఏ పనీ చేయలేదని చెప్పాడు. కానీ ఏడాదిన్నర కాలంలో 3.70లక్షల డాలర్లు అంటే 3.10 కోట్లు సంపాదించానని చెప్పాడు. ఏడాది మొత్తంలో 7 అంటే ఏడే సపోర్ట్ టికెట్లను పరిష్కరించానని చెప్పాడు. అయితే మధ్యలో ఓ సింగిల్ ఆటోమేటెడ్ డ్యాష్‌బోర్డును రూపొందించినట్లు అతను చెప్పాడు. ఇందుకోసం మూడు నెలల సమయం పట్టిందని కంపెనీకి చెప్పాడట.అయితే వాస్తవానికి ఈ పనిని చాట్‌జీపీటీ కేవలం మూడు రోజుల్లోనే పూర్తి చేసినట్లు తన పోస్టులో చెప్పుకొచ్చాడు. తను ఒక రోజులో ఎక్కువ సమయం వెచ్చించింది ఏదైనా ఉందీ అంటే అది మీటింగ్‌లకేనని అతను చెబుతున్నాడు. అమెజాన్ ఉద్యోగి చేసిన పోస్ట్ మీద సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. చాలా మంది ఆ ఉద్యోగి తీరును తప్పుబడుతున్నారు. ఒకవేళ చేసినా అలా ఎలా చెప్తాడని అంటున్నారు. ఇలాంటి వ్యక్తులే వ్యవస్థలను నాశనం చేస్తారని కామెంట్లు పెడుతున్నారు. కార్పోరేట్ కంపెనీలో చాలా మంది ఇలనే ఉంటారని..ఆ వ్యవస్థలోనే లోపం ఉందని అంటున్నారు మరో వ్యక్తి. Also Read: Telangana: ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో చెప్పండి.. తేల్చేద్దాం: పొన్నం #amazon #employee #software మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి