Lemon : ఈ నిమ్మకాయను కొనే డబ్బులతో ఏకంగా కారునే కొనొచ్చు.. ధర ఎన్ని లక్షలో తెలుసా? ఇంగ్లండులోని న్యూపోర్టులో 285ఏళ్లనాటి నిమ్మకాయ దొరికింది. తాజాగా యూకేలో జరిగిన ఓ వేలంలో ఎవరూ ఊహించని ధరకు అమ్ముడుపోయింది. ఈ నిమ్మకాయ ఏకంగా 1.4లక్షలు పలికింది. ఈ నిమ్మకాయను తన ప్రేమకు గుర్తుగా ఆ కాలంలో ఒక వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయికి బహుకరించినట్లు తెలుస్తోంది. By Bhoomi 04 Feb 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Lemon : చాలా మందికి పురాతన వస్తువులు, విశేషాలపై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఏళ్లనాటి అరుదైన వస్తువులను చూసేందుకు మ్యూజియంకు వెళ్తుంటారు. అదే ఇంకొందరికి మాత్రం పురాతన వస్తువులను సేకరించే అలవాటు కూడా ఉంటుంది. వివిధ సంస్థలు నిర్వహించే వేలంలో పాల్గొని భారీగా డబ్బులు చెల్లించి మరీ పురాతన వస్తువులను కొంటుంటారు. అయితే ఇంగ్లండులోని న్యూపోర్టులో 285ఏళ్ల కాలం నాటి నిమ్మకాయ దొరికింది. దానిని యూకేలో జరిగిన ఓ వేలంలో భారీ ధరకు అమ్మారు. ఎవరూ ఊహించని విధంగా వేలంలో రూ. 1.4లక్షలు పలికింది. వేలంలో భారీ ధర పలికిన ఈ అరుదైన నిమ్మకాయ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. అల్మారాలో 285 ఏళ్ల నిమ్మకాయ దొరికింది: ఒక నిపుణుడు వేలానికి ఉంచిన అల్మారా ఫోటోలు తీస్తున్నప్పుడు, డ్రాయర్ వెనుక ఉన్న ఈ నిమ్మకాయ గుర్తించారు. నిమ్మకాయను చూడగానే దానిపై ప్రత్యేక సందేశం రాసి ఉంది కనిపించింది. సందేశం ఇలా ఉంది - 'మిస్టర్. పి. లౌ ఫ్రాంచినీ మిస్ ఇ. బాక్స్టర్‌కి 4 నవంబర్ 1739న ప్రజెంట్ చేశారు అని రాసి ఉంది. అంటే ఈ మెసేజ్ ను బట్టి ఆ కాలంలో ఒక వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయికి బహుకరించినట్లు తెలుస్తోంది. ఈ నిమ్మకాయ వయస్సు 285 సంవత్సరాలు అని తేలింది. నిమ్మకాయ దొరికిన తర్వాత వేలం సంస్థ ఈ నిమ్మకాయను వేలానికి పెట్టింది. ఎవరైనా అందులో 40 నుంచి 60 పౌండ్లు అంటే రూ.4200 పలుకుతుందని ఊహించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా భారీ డబ్బుకు ఈ నిమ్మకాయ అమ్ముడుపోయింది. View this post on Instagram A post shared by Brettellsauctions (@brettellsauctions) ఈ నిమ్మకాయను వేలంలో 1416 పౌండ్లకు (1.48 లక్షల రూపాయలు) విక్రయించారు. కాగా ఈ నిమ్మకాయ దొరికిన అల్మారా కేవలం 40 డాలర్లకు అంటే రూ.3319 పలికింది. అల్మారాను వేలానికి ఇచ్చిన కుటుంబీకులు వేలం హౌస్‌కు చేరుకునే వరకు అల్మారాలో ఈ నిమ్మకాయ ఉన్న విషయం తెలియదు. నిమ్మకాయ 2 అంగుళాల వెడల్పు, పూర్తిగా ఎండిపోయినప్పటికీ తాజా నిమ్మకాయ ఆకారంలోనే ఉంటుంది. నిమ్మకాయను ఇన్ని రోజులు బాగా భద్రపరిచారు. ఇది కూడా చదవండి: రాంచరణ్ కూతురును చూసుకునే కేర్ టేకర్ జీతమెంతో తెలుస్తే షాక్ అవుతారు.!! #auction #auction-bid #lemon మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి