జయలలిత ఆస్తుల్లో 28 రకాల ఖరీదైన వస్తువులు మాయం

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. జయకు సంబంధించి ఎంతో విలువైన వస్తువులు మాయమయ్య అంటూ తమిళనాడు ఐటీశాఖ అధికారులకు కర్ణాటక ప్రభుత్వ లాయర్ లేఖ రాశాడు. జయలలిత ఆస్తుల్లో 28 రకాల ఖరీదైన వస్తువులు మాయమైనట్లు ఆయన వివరించాడు. బంగారం, వజ్రాభరణం తప్ప మిగిలినవి లేవంటూ లేఖలో వెల్లడించాడు.

New Update
జయలలిత ఆస్తుల్లో 28 రకాల ఖరీదైన వస్తువులు మాయం

28 types of expensive items disappeared from Jayalalitha property

ఎక్కడ ఖరిదైన వస్తువులు..?

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో కొన్ని ఖరీదైన వస్తువులు కనిపించకపోవడం కలకలం రేపుతోంది. ఈ కేసులో 1996లో ఆమె నుంచి 30 కేజీల బంగారం, వజ్రాభరణాలు సహా మరెన్నింటినో స్వాధీనం చేసుకున్నారు. అయితే, వీటిలో ఈ రెండు తప్ప మిగతా 28 రకాల ఖరీదైన వస్తువులు మాయమైనట్టు తమిళనాడు అవినీతి నిరోధక శాఖకు కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది లేఖ రాశారు.

కర్నాటక కోర్టులో అప్పగించాలి

జయలలితకు చెందిన 11 వేల 344 ఖరీదైన చీరలు, 250 శాలువాలు, 750 జతల పాదరక్షలు, గడియారాలు తదితర 28 రకాల వస్తువుల జాడ లేదని, అవెక్కడున్నాయో తెలియదని అందులో పేర్కొన్నారు. అవి కనుక మీ అధీనంలో ఉంటే వాటిని కర్నాటక కోర్టులో అప్పగించాలని కోరారు. బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ వస్తువుల వేలానికి ప్రభుత్వం తరపున న్యాయవాది నియమితులైన తర్వాత పలు ఖరీదైన వస్తువులు మాయం అయిన విషయం వెలుగులోకి వచ్చింది.

అక్రమస్తులతో విలువైన  ఆస్తులు

తమిళనాడుకి 6 సార్లు సీఎంగా పని చేసిన జయలలిత 1991–96లో ఆమె సీఎంగా ఉన్న సమయంలో ఆమె తన కార్యాలయాన్ని దుర్వినియోగం చేసి రూ.66.65 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టి, ఆ మొత్తాన్ని తన ప్రాక్సీ అకౌంట్‌ల్లో జమ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. చెన్నైలోని ఫామ్‌హౌస్‌లు, బంగ్లాలు, వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్, నీలగిరిలోని ఒక టీఎస్టేట్, విలువైన ఆభరణాలతో సహా 3000 ఎకరాలు ఆస్తులు కేసు పరిధిలో ఉన్నాయి. పారిశ్రామిక షెడ్లు, నగదు డిపాజిట్లు మరియు బ్యాంకులలో పెట్టుబడులు మరియు విలాసవంతమైన కార్ల ఉండేవి. 1997లో ఆమె పోయెస్ గార్డెన్ నివాసంలో జరిగిన దాడిలో 800 కిలోల వెండి, 28 కిలోల బంగారం, 750 జతల బూట్లు, 10,500 చీరలు, 91 వాచీలు మరియు ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

అందరూ దోషులే..

ఈ మొత్తాన్ని చెన్నైలోని ఆర్‌బీఐ ఖజానాలో విలువైన వస్తువులను భద్రపరిచారు. ఆ ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీ కోర్టును ఆశ్రయించింది, అయితే 2014 జనవరిలో వాటిని తనిఖీ చేసిన లాయర్‌ వాటిని బెంగళూరుకు బదిలీ చేశారు. ప్రత్యేక కోర్టులో 27 సెప్టెంబర్ 2014న తీర్పు మొత్తం నాలుగు పార్టీలను దోషులుగా నిర్ధారించింది. కోర్టు తీర్పు కారణంగా అధికార పదవి నుంచి వైదొలగాల్సిన తొలి కేసు కావడంతో ఈకేసు రాజకీయ చిక్కులను ఎదుర్కొంది. తర్వాత,  2015 మే11న, కర్ణాటక హైకోర్టు జయలలితను అన్ని అభియోగాల నుండి నిర్దోషిగా ప్రకటించింది. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను పునరుద్ధరించిన సుప్రీంకోర్టు.. 2017 ఫిబ్రవరి 15న ఈ కేసును విచారించి అందరినీ దోషులుగా తీర్పు ఇచ్చింది.

Advertisment
తాజా కథనాలు