ఇంగ్లండ్ ఉష్ణోగ్రత పై కామెంట్ చేస్తున్న భారత నెటిజన్లు!

New Update
ఇంగ్లండ్ ఉష్ణోగ్రత పై కామెంట్ చేస్తున్న భారత నెటిజన్లు!

ప్రపంచవ్యాప్తంగా వేడి ప్రభావం పెరుగుతోంది. వాతావరణ మార్పులు, భూతాపం వంటి వివిధ కారణాల వల్ల వేడి ప్రభావం పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా భారత్‌తో సహా దేశాల్లో ప్రస్తుత సంవత్సరంలో వేడి చాలా తీవ్రంగా ఉంది. చాలా నగరాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంబై, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో హీట్ వేవ్ హెచ్చరికను అక్కడి ప్రభుత్వాలు జారీ చేశాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ప్రారంభం కావడంతో వేడిగాలుల ప్రభావం తగ్గుముఖం పట్టింది.

ఇంగ్లండ్ లో జూన్ నెలాఖరులో వడగాలులు వీచే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది. అంటే 26 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ హీట్ వేవ్ వార్నింగ్ చూసి ఇండియాలోని నెటిజన్లు అవాక్కయ్యారు.  దీన్నినెటిజన్లు ఇంటర్నెట్‌లో ట్రెండ్‌గా మార్చారు. భారతదేశంలో మనం ఇంట్లో  ఏసీ ఉష్ణోగ్రత 2 డిగ్రీలు ఎక్కువగా ఉందని 26 డిగ్రీల హీట్ వేవ్ ఉంటే ఇంగ్లండ్ ప్రజలు ఇండియాకు వస్తే ఎలా తట్టుకుంటారో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు