Andhra Pradesh: గ్రౌండ్‌ఫ్లోర్‌‌లో ఉన్న ప్రతీ ఇంటికి 25వేల రూ.–సీఎం చంద్రబాబు

విజవాడ వరదల్లో గ్రౌండ్ ఫ్లోర్‌‌లో మునిగిపోయి ప్రతీ ఇంటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 25 వేల రూపాయల ఆర్ధిక సహాయం చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అనౌన్స్ చేశారు. దాంతో పాటూ టూ వీలర్స్ దెబ్బ తింటే 3 వేలు, త్రీవీలర్స్ అయితే రూ.10 వేలు ఇస్తామని తెలిపారు.

New Update
CHANDRABABU

CM Chandra Babu: బుడమేరు , కృష్ణా వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఏడెనిమిది రోజుల పాటు చాలా ప్రాంతాలు నీటిలో ఉండిపోయాయి. 11.43 లక్షల క్యూసెక్కుల వరదనీరు రావడం చరిత్రలో తొలిసారి. 175 ఏళ్ల చరిత్ర ఉన్న బ్యారేజి ఇది. కేవలం 11.90 లక్షల క్యూసెక్కుల కెపాసిటీ మాత్రమే దీనికి ఉంది. భవానీ పురం లో కూడా నీరు ఓవర్ ఫ్లో అయ్యింది. దీనంతటికీకారణం గత పాలకుల నిర్లక్ష్యమే అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. బుడమేరు దురాక్రమణలు కూడా వరద ముంపునకు కారణం అయ్యింది.100 రోజుల పాలన లోనే మా ప్రభుత్వం ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వైసీపీ రంగులు ఉన్న బోట్లు కూడా బ్యారేజి గేట్ లను ఢీ కొట్టాయి. ఉద్దేశ పూర్వకంగానే జరిగిన ఘటన ఇది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం పై 7 శ్వేత పత్రాలను విడుదల చేశాం. ఆ తరవాత ఈ విపత్తు వచ్చింది. మంత్రుల ను అక్కడే పెట్టీ 10 రోజుల్లో సాధారణ పరిస్థితికి తెచ్చామని చెప్పుకొచ్చారు. విపత్తు నిర్వహణ లో 2 వేల కోట్ల మేర ఖర్చు పెట్టిన డబ్బు అకౌంట్ లో కూడా చూపెట్టలేదు. వరద ముంపు లో ఉన్న బాధితులను కొన్ని సార్లు అదుకోలేని నిస్సహాయత కూడా ఎదురైంది. వారి కష్టాలు చూసి యుద్ధ ప్రాతిపదికన ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం . మళ్ళీ వరదలకు ప్రజలు బలి కాకుండా శాశ్వత పరిష్కారం కూడా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 

అదలా ఉంటే వరద ముంపు ప్రాంతాల్లో మునిగిన అందరికీ 25 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. 179 సచివాలయాల పరిధిలో నీట మునిగిన మొదటి ఫ్లోర్, ఇతర ఫ్లోర్ లో ఉన్న వారికి కూడా 10 వేల రూపాయల ఆర్థిక సాయం ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ ఇల్లు నీట మునిగి నా 10 వేల రూపాయల, దుకాణాలకు 25 వేల రూపాయలు సాయం చేస్తామన్నారు. దాంతో పాటూ ఏం ఎస్ ఏం ఈ 40 లక్షల కంటే టర్నోవర్ తక్కువ ఉన్నవారు 50 వేల రూపాయల ఆర్థిక సాయం..40 లక్షల నుంచి 1.5 కోట్ల టర్నోవర్ ఉంటే 1 లక్ష.. 1.5 కోట్ల టర్నోవర్ ఉన్న వారికి 1.5 లక్షల ఆర్థిక సాయంగా ఇవ్వనున్నారు. ఇక 9,888 వేల ద్వి చక్ర వాహనాలకు 3 వేలు.. ఆటోలకు 10 వేల రూపాయలు..తోపుడు బళ్ళు కొత్తవి ఇస్తాం. మగ్గం నీస్ వారికి 25 వేలు, ఫిషింగ్ బోటు , వల తో సహా మోటార్ ఉన్న వాటికి 25 వేలు, ఆవులు, గేదెలు..ఒక్కో కోడికి 100 రూపాయలు చొప్పున, వ్యవసాయం వరి హెక్టార్ కు 25 వేల రూపాయల చొప్పున, ఎకరాకు 15 వేల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే ఉద్యాన పంటలు 25 నుంచి 35 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని తెలిపారు. చరిత్రలో తొలిసారి గా ప్రాక్టికల్ గా ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని..బ్యాంకు రుణాలు పై మారటోరియం, రుణాల రీ షెడ్యూలు చేయాలని కోరామనితెలిపారు. అర్బన్ కంపెనీ ద్వారా వివిధ ఉపకరణాలు కూడా బాగు చేయించి ఇచ్చాం. సర్వీసు చేయని ఉపకరణాల కంపెనీల వివరాలు బయట పెడతాం. ద్విచక్ర, వాహనం, ఆటోల, కార్లు ఆయా కంపెనీల సర్వీస్ సెంటర్ లలో బాగు చేయించి ఇస్తున్నాం.వరద ముంపు ప్రాంతాల్లో బాధితులను ఆదుకోవడంలో ఎక్కడా రాజీ లేదు.చివరి వ్యక్తి కి కూడా సాయం అందాలి. భవిష్యత్ లో వరద ముంపు రాకుండా..ఆపరేషన్ బుడమేరు మొదలు పెడతామని చెప్పారు ఆంధ్రా సీఎం.

Advertisment
తాజా కథనాలు