Stock Markets : ఈరోజు నుంచి టీ+0 సెటిల్ మెంట్.. లాభాల్లో కొనసాగుతున్న దేశీ మార్కెట్లు

ఏ రోజు కొన్న, అమ్మిన షేర్లు ఆ రోజే ఖాతాల్లో కనిపించే, బదిలీ అయ్యే టీ+0 విధానాన్ని ఇవాల్టి నుంచి బోంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ , నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ అందుబాటులోకి తేనున్నాయి. మొదట ఈ అవకాశం 25 కంపెనీ షేర్లు, కొంత మంద్రి బ్రోకర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చాయి.

New Update
Stock Markets : ఈరోజు నుంచి టీ+0 సెటిల్ మెంట్.. లాభాల్లో కొనసాగుతున్న దేశీ మార్కెట్లు

Stock Market Today : ఇప్పటి వరకు ఎవరైనా షేర్లు కొన్నా... లేక అమ్మినా... అవి మన ఖాతాల్లో కనపడటం, ఇతరులకు ట్రాన్స్ఫర్ కావడం మర్నాటికి జరిగేది. ఇప్పుడు ఈ పద్ధతిని మారుస్తుననారు. ఈరోజుది ఆ రోజే కనబడేలా ఈ విధానాన్ని మెరుగుపరుస్తున్నారు. కొనుగోలు/అమ్మకం లావాదేవీ జరిగిన రోజే సెటిల్‌ చేసే టీ+0 విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చాయి బోంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ(BSE), నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(NSE) లు. అయితే ఈ విధానం అప్పుడే అందరికీ అందుబాటులోకి రావడం లేదు. మొదట కొంతమందికి మాత్రమే అవకాశం ఇస్తున్నారు. మొదట 25 కంపెనీ షేర్లకు, కొంత మంది బ్రోకర్లకు మాత్రమే ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి.

25 కంపెనీ షేర్లు...

మొదట టీ+0 సెటిల్‌మెంట్‌(T+0 Settlement) ను కేవలం 25 కంపెనీలకు మాత్రమే అందుబాటులోకి తెచ్చాయి. వాటిల్లో బజాజ్‌ ఆటో 2) వేదాంతా 3) హిందాల్కో ఇండస్ట్రీస్‌, 4) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 5) ట్రెంట్‌ 6) టాటా కమ్యూనికేషన్స్‌ 7) నెస్లే ఇండియా 8) సిప్లా 9) ఎంఆర్‌ఎఫ్‌ 10) జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, 11) బీపీసీఎల్‌ 12) ఓఎన్‌జీసీ 13) అంబుజా సిమెంట్స్‌ 14) అశోక్‌ లేలాండ్‌ 15) బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 16) బిర్లా సాఫ్ట్‌ 17) కోఫోర్జ్‌ 18) దివీస్‌ లేబొరేటరీస్‌ 19) ఇండియన్‌ హోటల్స్‌ 20) ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 21) ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ 22) యూనియన్‌ బ్యాంక్‌ ఇండియా 23) ఎన్‌ఎమ్‌డీసీ 24) సంవర్థన మదర్‌సన్‌ ఇంటర్నేషనల్‌ 25) పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ ఉన్నాయి. వీటి నుంచి ఏ లావాదేవీలు చేసినా వెంటనే ఖాతాల్లో కనిపిస్తాయి.

ఇక టీ+0 విధానాన్ని మన ఛాయిస్‌గా ఉంచుకోవచ్చును. ఎంపిక చేసిన బ్రోకర్ల పరిధిలో అందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చును. ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ట్రేడింగ్‌కు దీనిని అమలు చేస్తారు. దీని వలన మార్కెట్ కార్యకలాపాల వ్యయాలు, సమయం ఆదా అవుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మదుపర్ల నుంచి వసూలు చేసే అమౌంట్‌లో పారదర్శకత వస్తుందని అంటున్నారు. భారత ట్రేడింగ్‌ మౌలిక వసతులను మార్చడంలో ఇది కీలక అడుగని చెబుతున్నారు.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు...

వరుసగా రెండో రోజు దేశీ మార్కెట్ సూచీలు లాబాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల(International Markets) లో మిశ్రమ ఫలితాలు కనిపించినప్పటికీ ఆ ప్రభావం దేశీ మార్కెట్ల మీద పెద్దగా పడలేదు. ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్‌ 195 పాయింట్లు లాభపడి 73,191 దగ్గర ఉండగా.. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.30 వద్ద మొదలైంది. విప్రో, పవర్‌గ్రిడ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. టైటన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, రిలయన్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Also Read : Delhi Liquor Scam : ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ ఏం జరగబోతోంది?.. కేజ్రీవాల్ ఏం మాట్లాడతారు?

Advertisment
Advertisment
తాజా కథనాలు