కేజీ ఉల్లిపాయ రూ. 25 లే..ఎక్కడంటే!

ఢిల్లీ- ఎన్‌సీఆర్‌ లో ఉండే ప్రజలకు కిలో ఉల్లిని రూ. 25 లకే అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అధిక ధరలతో బాధపడుతున్న ప్రజలకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయమనే చెప్పుకోవచ్చు.

Onion Exports: ఉల్లి ఎగుమతులపై నిషేధం తొలగింపు.. ఇప్పుడే ఎందుకు? దేశంలో ధరలు పెరుగుతాయా?
New Update

దేశ వ్యాప్తంగా ఉల్లిపాయలు కొసేటప్పుడు కాకుండా ...కొనేటప్పుడు కూడా ఏడిపిస్తున్నాయి. కేజీ ఉల్లి ధర రూ. 100 కి చేరడంతో వినియోగదారులు ఉల్లి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కొన్ని నగరాల్లో చౌక ధరలకు ఉల్లిపాయలను అందిస్తున్నాయి.

ఇందులో భాగంగానే ఢిల్లీ- ఎన్‌సీఆర్‌ లో ఉండే ప్రజలకు కిలో ఉల్లిని రూ. 25 లకే అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అధిక ధరలతో బాధపడుతున్న ప్రజలకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయమనే చెప్పుకోవచ్చు. రెండు నెలల నుంచి ఉల్లి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి.

రెండు నెలల నుంచి దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఘాటేక్కుతున్నాయి. ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో ఉల్లి రిటైల్ ధరలు కిలో రూ. 100 కి చేరుకున్న విషయం తెలిసిందే. వినాయకచవితి దాటిన తరువాత నుంచి ఉల్లి ధరలు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. వరుస పండుగల నేపథ్యంలో ఉల్లి ధరలు దేశ వ్యాప్తంగా విపరీతంగా పెరిగాయి.

Also read: మనసులను లాక్‌ చేసే లిప్స్‌.. లేలేత అధరాల కోసం ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి!

దీంతో ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం కలగజేసుకుంది. ఈ వారం చివరి నుంచి సఫాల్ మదర్‌ డెయిరీలో బఫర్ స్టాక్‌ నుంచి ఉల్లిపాయల అమ్మకాలు ప్రారంభం అవుతాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంతకు ముందే ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే సంవత్సరానికి ప్రభుత్వం ఐదు లక్షల టన్నుల ఉల్లిపాయల బఫర్‌ స్టాక్‌ ను నిర్వహించింది.

అదనంగా రెండు లక్షల టన్నుల బఫర్‌ ను రూపొందించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీని వల్ల ఉల్లి టోకు ధరలు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం అంటుంది. ఇదంతా ఇలా ఉండగా హైదరాబాద్ వ్యవసాయ సహకార సంఘం ఇప్పటికే తెలంగాణతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజలకు ఉల్లిపాయలను సబ్సిడీ పై అందజేస్తోంది.

ఎన్ఐఎఫ్‌ఐడీ ఇప్పటివరకు 21 రాష్ట్రాల్లోని 55 నగరాల్లో మొబైల్ వ్యాన్‌లు, స్టేషన్ అవుట్‌లెట్‌లతో సహా 329 రిటైల్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరోవైపు ఎన్‌సీసీఎఫ్‌ 20 రాష్ట్రాల్లోని 54 నగరాల్లో 457 రిటైల్ కేంద్రాలను ప్రారంభించింది.

#prices #onions
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి