/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Big-tragedy-in-Telangana.-8-people-were-struck-by-lightning-jpg.webp)
Bihar Rains: బీహార్‌లో భారీ వర్షాలు, వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రమాదకర స్థాయిని మించి నదులు ఉప్పొంగుతున్నాయి. కైమూర్ హిల్స్‌లోని మా తుట్ల భవానీ డ్యామ్‌కు ఒక్కసారిగా వరద పోటెత్తింది. వరదలో 10మందికి పైగా పర్యాటకులు చిక్కుకున్నారు. తాళ్ల సాయంతో వారిని సురక్షితంగా ఒడ్డుకు రెస్క్యూ టీమ్ చేర్చింది. వాటర్‌ఫాల్స్ అందాలను చూసేందుకు వేలసంఖ్యలో పర్యటకులు తరలివచ్చారు. జలపాతాల దగ్గర స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా వరద పోటెత్తింది.
ఇక పిడుగులతో కూడిన వర్షాలకు జనం వణికిపోతున్నారు. పిడుగుపాటుకు 24గంటల్లోనే 25మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరో రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కిషన్‌గంజ్, అరారియా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Also Read: అనంత్ పెళ్ళిలో నీతా అంబానీ స్పెషల్ మెహందీ డిజైన్.. వీడియో వైరల్