Magha Purnima: ఈసారి మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది..ఈరోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి! ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఎప్పుడూ వచ్చింది అనే దాని మీద సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 3.33 గంటల నుంచి పౌర్ణమి ఘడియలు ప్రారంభం అయ్యి మరుసటి రోజు సాయంత్రం 5.59 గంటల వరకు ఉంటుంది. By Bhavana 22 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Magha Purnima: హిందూ మతంలో మాఘ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో వచ్చే పూర్ణిమకు మరింత ప్రత్యేకత ఉంది. ఈ మాఘ పూర్ణిమనాడు శ్రీమహా విష్ణువును, లక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఆరాధించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు నెలకొంటాయని పండితులు చెబుతున్నారు. ఈరోజున గంగాస్నానమాచరించి కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల లక్ష్మీ దేవీ ఇంట్లో కొలువై ఉంటుందని నమ్మకం. ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఎప్పుడూ వచ్చింది అనే దాని మీద సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 3.33 గంటల నుంచి పౌర్ణమి ఘడియలు ప్రారంభం అయ్యి మరుసటి రోజు సాయంత్రం 5.59 గంటల వరకు ఉంటుంది. హిందూ ధర్మం ప్రకారం ఉదయం తిథినే పరిగణనలోనికి తీసుకోవడంతో మాఘ పూర్ణిమను ఈ ఏడాది ఫిబ్రవరి 24 శనివారం నాడే జరుపుకుంటారు. నదీ స్నానం.. మాఘ పూర్ణిమ రోజున బ్రహ్మ ముహుర్తంలో నిద్ర లేవాలి.నదిలో స్నానం చేయడం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. నదికి వెళ్లలేని స్థితిలో ఇంట్లోనే స్నానం చేసే నీటిలో గంగాజలం వేసి స్నానం చేయాలి. సూర్య భగవానునికి నీటిలో నల్ల నువ్వులు మరియు కుంకుడు కలిపి అర్ఘ్య నైవేద్యాన్ని తప్పకుండా సమర్పించాలి. అలాగే, ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించండి. విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి విగ్రహాలకు పూలు, నువ్వులు, బార్లీ గింజలు, గంధం, పసుపు మొదలైన వాటిని సమర్పించాలి. నెయ్యి దీపాలను దేవతా విగ్రహాల ముందు వెలిగించి విష్ణు పారాయాణాన్ని పఠించాలి. తరువాత ప్రసాదాన్ని అందరికీ పంచి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకోవాలి. ఈరోజున బ్రాహ్మణులకు ఆహారం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి. Also read: మార్చి 31 నుంచి చెన్నై విమానాశ్రయంలో డిజి యాత్ర సదుపాయం ప్రారంభం! #lifestyle #february #magh-purnima #puja-vidhi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి