TSRTC Apprenticeship Jobs: తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లకు అప్లై చేసి పరీక్షలు వాయిదా పడటంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన అభ్యర్థులకు కాస్త ఊరట కలిగించే వార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ డిపోల్లో 150 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
150 ఉద్యోగాలు..
ఈ మేరకు టీఎస్ఆర్టీసీ రీజియన్ల (డిపో/ యూనిట్)లో నాన్ ఇంజినీరింగ్ విభాగంలో 150 అప్రెంటిస్ శిక్షణ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరింది. ఈ ఖాళీలకు బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ పట్టభద్రులు నాన్ ఇంజినీరింగ్ విభాగానికి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనుండగా వివిధ జిల్లాల్లో పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: ఇండియన్ ఆయిల్ లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు
హైదరాబాద్ రీజియన్- 26
సికింద్రాబాద్ రీజియన్- 18
మహబూబ్ నగర్ రీజియన్- 14
మెదక్ రీజియన్- 12
నల్గొండ రీజియన్- 12
రంగారెడ్డి రీజియన్- 12
ఆదిలాబాద్ రీజియన్- 09
కరీంనగర్ రీజియన్- 15
ఖమ్మం రీజియన్- 09
నిజామాబాద్ రీజియన్- 09
వరంగల్ రీజియన్- 14
అర్హత:
అభ్యర్థులు బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ కోర్సుల్లో 2018-2023 విద్యా సంవత్సరంలో పాసై ఉండాలి.
వయోపరిమితి:
21 నుంచి 35 సంవత్సరాలకు మించరాదు.
మూడేళ్లు శిక్షణ;
మొదటి మూడు సంవత్సరాలు వరుసగా నెలకు రూ.15,000, రూ.16000, రూ.17,000 స్టైపెండ్ చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి ముందు www.nats.education.gov.in/ వెబ్సైట్లో అభ్యర్థులు వివరాలను నమోదు చేసుకోవాలి. 2024 ఫిబ్రవరి 16 అప్లికేషన్ లాస్ట్ డేట్.
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.tsrtc.telangana.gov.in/