దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న పండుగలలో మొదటిది వినాయక నవరాత్రులు. ఈ నవరాత్రులు వినాయకచవితి రోజున ప్రారంభమవుతాయి. భాద్రపదమాస శుక్ల పక్ష చవితి తిథి వినాయక చవితి. వీటిని దేశ ప్రజలంతా కూడా ప్రతి సంవత్సరం ఎంతో ఆనందం, ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం వినాయక తిథి 2024 సెప్టెంబర్ 7 శనివారం రోజున ప్రారంభమై,17 సెప్టెంబర్ అనంత చతుర్దశి, మంగళవారం నాడు ముగుస్తుంది.
వినాయక చవితి తిథి నిర్ణయం:
• భాద్రపద శుక్ల చవితి తిథి తేదీ సెప్టెంబర్ 06, 2024 శుక్రవారం మధ్యాహ్నం 12:08 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు సెప్టెంబర్ 7 శనివారం మధ్యాహ్నం 2.05 గంటల వరకు కొనసాగుతుంది. సూర్యోదయానికి తిథి సెప్టెంబర్ 7వ తేదీన ఉండడంతో ఆరోజే వినాయక చవితి జరుపుకోనున్నారు.
గణేష్ చతుర్థి నాడు చంద్ర దర్శనం ఎందుకు నిషిద్ధం:
• గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూడొద్దని చెబుతుంటారు. ఎందుకంటే అలా చేయడం వల్ల నీలాపనిందలు కలుగుతాయని అంటారు. ఈరోజు చంద్రుడిని చూడడం వల్ల చేయని తప్పుకు దోషిగా పరిగణింపబడవచ్చు... భాద్రపద శుక్ల పక్ష చతుర్థి నాడు చంద్రుడిని చూసినందుకుగానూ...శ్రీకృష్ణుడు కూడా దొంగతనం చేశాడన్న అపనిందలపాలయ్యాడని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకని వినాయకచవితి రోజున ఎట్టి పరిస్థితుల్లో చంద్ర దర్శనం చేయకూడదు. ఒకవేళ ఎవరైనా చంద్రుడిని అనుకోకుండా చూస్తే దానికి పరిహారంగా శమంతకమణి కథను చదువుకుని అక్షతలను తలపై వేసుకోవాలి.
• గణేష్ చతుర్థి 2024 పూజ విధి:
• గణేష్ చతుర్థి రోజున పూజా విధానంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
• ఈ రోజున స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
• ఇంటికి ఉత్తరం, తూర్పు దిశలో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించాలి.
• వినాయకుని పూజకు అవసరమైన సామాగ్రిని తప్పకుండా ఉంచుకోవాలి.
• పసుపు, దుర్వ గడ్డి, పరిమళ ద్రవ్యం, మోదకం, చందనం, అక్షతలు వంటివి తప్పకుండా ఉంచుకోవాలి.
• గణేశుడికి అగరబత్తులు, పూల దండలు వంటివి చేకూర్చుకుని, శుభ సమయంలో పూజను ప్రారంభించాలి.
ముఖ్యమైన విషయాలు:
• ఈ సంవత్సరం వినాయక విగ్రహాన్ని ఇంటికి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లయితే.. గణేశుడి విగ్రహం మట్టితో తయారు చేయబడేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గణేశుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చేటప్పుడు దానిని శుభ్రమైన గుడ్డతో కప్పాలి. మీ పూజా స్థలంలో నీటితో నిండిన కలశాన్ని ప్రతిష్టించాలి.
ఇది కూడా చదవండి: ఇంట్లోనే రుచికరమైన బ్లూలగూన్ డ్రింక్ ఇలా చేస్తే .. వదిలిపెట్టారంతే