Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. 4 గేట్లు 5 ఫీట్లు, 16 గేట్లను 10 ఫీట్లు పైకెత్తి దిగువకు నీరు విడుదల చేశారు. నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో 3,00,530 క్యూసెక్కులు... క్రస్ట్ గేట్ల ద్వారా ఔట్ ఫ్లో 2,54,460 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. కాగా రెండేళ్ల తరువాత నాగార్జున సాగర్ గేట్లను ఎత్తడంతో ప్రజలు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు.
శ్రీశైలం నుంచి వరద ఎక్కువగా రావడంతో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారు అధికారులు. శ్రీశైలం నుంచి వచ్చే వరద ఆధారంగా మరో నాలుగు రోజుల పాటు గేట్లు ఎత్తే ఉంటాయని ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు. దీంతో సెలవు పెట్టుకొని మారి ఆ అందాలను చూసేందుకు పర్యాటకులు అక్కడి చేరుకుంటున్నారు. శ్రీశైలంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ నీటిని విడుదల చేయడం తమకు ఎంతగానో లాభమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : బాంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూల ఇళ్లపై దాడి, మహిళలపై అత్యాచారం!