Delhi: ఢిల్లీలోని షహ్దారాలోని శాస్త్రి నగర్లో ఉన్న నివాస భవనంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటల కారణంగా పార్కింగ్‌లో నిలిపి ఉంచిన నాలుగు వాహనాలు దగ్ధమయ్యాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఎలాగోలా మంటలను అదుపు చేశారు.
పార్కింగ్ స్థలం నుంచి మంటలు
శాస్త్రినగర్‌లోని వీధి నంబర్-13లోని 65వ నెంబరు ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇది నాలుగు అంతస్తులతో కూడిన నివాస భవనం. దీనితో పాటు గ్రౌండ్ ఫ్లోర్, పార్కింగ్ కూడా ఉంది. పార్కింగ్ స్థలం నుంచి మంటలు చెలరేగి భవనమంతా వ్యాపించడంతో భవనం అంతా పొగతో నిండిపోయింది. వీధి చాలా ఇరుకుగా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తీవ్రంగా శ్రమించి మంటలను
సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, “గీతా కాలనీ సమీపంలోని శాస్త్రి నగర్‌లో ఉదయం 5.20 గంటలకు భారీ అగ్నిప్రమాదం గురించి మాకు సమాచారం అందింది. వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు సమాచారం అందించాం. సంఘటనా స్థలానికి పోలీసు బృందం, నాలుగు ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్, పీసీఆర్ వ్యాన్‌లను పంపించామని.. మంటలు చెలరేగిన భవనం నాలుగు అంతస్తులు కలిగి ఉందని, గ్రౌండ్ ఫ్లోర్‌లో కార్ పార్కింగ్ ఉందని పోలీసులు తెలిపారు. పార్కింగ్ స్థలం నుంచి మంటలు చెలరేగాయని, పొగలు భవనం అంతటా వ్యాపించాయని చెప్పారు.
మృతుల్లో 5 ఏళ్లు, 3 ఏళ్ల బాలికలు
"వీధి ఇరుకైనప్పటికీ, అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు" అని అధికారి తెలిపారు. ప్రతి అంతస్తులో వెతికారు. ముగ్గురు పురుషులు, నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులను అక్కడి నుంచి తరలించి హెడ్గేవార్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.మృతుల్లో 30 ఏళ్ల మనోజ్, 28 ఏళ్ల మహిళ సుమన్, 5 ఏళ్ల బాలిక, 3 ఏళ్ల బాలిక ఉన్నారు.
Also read: సీటు విషయం తేల్చుకునేందుకు చంద్రబాబును కలిసిన గంటా!