TRAI: 2.75 లక్షల నంబర్లు కట్..స్పామ్ కాల్స్ మీద చర్యలు

స్పామ్ కాల్స్ విషయంలో ట్రాయ్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికి 2.75 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్ చేసింది. మరో 50 సంస్థలను ఈ లిస్ట్‌లో చేర్చేందుకు రెడీ అవుతోంది.

New Update
TRAI: 2.75 లక్షల నంబర్లు కట్..స్పామ్ కాల్స్ మీద చర్యలు

Spam Calls Block: అవాంఛిత కాల్స్ మీద ట్రాయ్ గట్టిగానే కొరడా ఝళిపిస్తోంది. రిజిస్టర్డ్ కాని టెలీ మార్కెటింగ్ కంపెనీల మీద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. ఇంతకు ముందే వీటి మీద చర్యలు ఉంటాయని ట్రాయ్ చెప్పింది. ఇందులో భాగంగా..ప్రస్తుతం 2.75 లక్షల మొబైల్ నంబర్లను బ్లాక్ చేసింది. మరో 50 సంస్థలనూ బ్లాక్ లిస్ట్‌లో చేర్చింది. అన్‌రిజిస్టర్డ్‌ టెలీమార్కెటర్లపై చర్యలు తీసుకోవాలన్న ట్రాయ్‌ ఆదేశాల మేరకు టెల్కోలు ఈ చర్యలు చేపట్టాయి.

భారతదేశంలో స్పామ్ కాల్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. స్వయంగా ట్రాయ్ ఈ నకిలీ కాల్స్ విషయాన్ని ప్రకటించింది. టెలీ మార్కెటింగ్ రంగంలో ఉన్న కంపెఈల మీద 7.9 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయని ట్రాయ్ చెప్పింది. దీని మీద ఆగస్టు 13 నుంచి అన్ని ఫోన్ ప్రోవైడర్లకు కఠినమైన సూచనలు జారీ చేసింది ట్రాయ్. రిజిస్టర్ కాని టెలీ మార్కెటింగ్ సంస్థలను వెంటనే వాటిని కట్టడి చేయాలని కోరారు.  టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా టెలికాం కంపెనీలను రిజిస్టర్ కాని టెలిమార్కెటింగ్ సంస్థలను బ్లాక్ లిస్ట్ చేసి, వారి నంబర్లను బ్లాక్ చేయాలని కోరింది.

Also Read:  Pawan kalyan: వరద ప్రాంతాల్లో అందుకే పర్యటించలేదు: పవన్ కల్యాణ్

Advertisment
Advertisment
తాజా కథనాలు