1993లో మణిపూర్‌లో ఏం జరిగిందో తెలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది... 750 మంది ఎలా చనిపోయారు?

ఈశాన్యరాష్ట్రాల్లో మణిపూర్...రత్నాల భూమి, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది. అలాంటి మణిపూర్ లో హింసా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈఏడాది మే 3న మొదలైన తెగల మధ్య ఘర్షణ వందల మందిని బలికొన్నది. మణిపూర్ లో ఘర్షణ ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఈ మతకల్లోలాల మంటల్లో మణిపూర్ చిక్కుకుంది. 1993లో కుకీ,నాగా కమ్యూనిటీల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 750 మందికి పైగానే మరణించారు. ఈ సంఖ్య అధికారికంగా వెల్లడించింది మాత్రమే. ఈ అల్లర్లలో గ్రామాలకు గ్రామాలకే నాశనమయ్యాయి. 1993లో ఏం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

New Update
1993లో మణిపూర్‌లో ఏం జరిగిందో తెలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది... 750 మంది ఎలా చనిపోయారు?

కొన్ని నెలలుగా, మణిపూర్ మండుతోంది. ప్రతిచోటా విధ్వంసం, దహనం, అల్లర్లు, గందరగోళ వాతావరణం ఏర్పడింది. కుకీ, మైతేయ్ వర్గాల ప్రజల మధ్య నిరసనతో మొదలైన అలజడి ఈరోజు రాష్ట్రాన్ని అట్టుడికిస్తోంది. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 160-170 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. స్థానిక పోలీసులు, భద్రతా సిబ్బంది ప్రతిచోటా భారీగా మోహరించారు. చాలామంది ప్రజలు బిక్కుబిక్కుమంటు బతుకున్నారు. అయితే ఈ అల్లర్ల మణిపూర్ కు తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా రెండు వర్గాల మధ్య రక్తపాతం జరిగింది. రాష్ట్రం అగ్నిగుండంలో కాలిపోయి విధ్వంస దృశ్యాన్ని చూసింది. నేటికీ చాలా మందికి ఈ అల్లర్ల గురించి తెలియదు. 1993లో, నాగా, కుకీ కమ్యూనిటీ ప్రజల మధ్య చాలా భీకర అల్లర్లు జరిగాయి. ఇందులో వందలాది మంది మరణించారు. కొన్ని లెక్కలు సుమారు 700 మంది అని చెబుతుంటే.అనధికారికంగా మాత్రం 750మందికి పైగానే మరణించారు.

నాగాలు, మైనారిటీ కుకీ కమ్యూనిటీల మధ్య వివాదం రక్తపాతంగా మారింది. చాలా గ్రామాలు కాలిబూడిదయ్యాయి. కుకీ, నాగాల మధ్య జాతి శత్రుత్వం, రెండు క్రైస్తవ సంఘాలు, జెనోఫోబిక్ అభద్రతాభావాలచే ఆజ్యం పోసాయి. తమ భూమిని కూకీ వర్గీయులు ఆక్రమించారని స్థానిక నాగులు వాపోయారు. వాస్తవానికి, నాగులు ఎల్లప్పుడూ కుకీ కమ్యూనిటీ ప్రజలను విదేశీయులుగా భావించేవారు. అయినప్పటికీ, కొంతమంది కుకీలు 18వ శతాబ్దంలో బర్మాలోని చిన్ హిల్స్‌లోని తమ స్వస్థలం నుండి తరిమివేసినప్పటి నుంచి మణిపూర్‌లో నివసిస్తున్నారు. నేడు, రాష్ట్ర జనాభా 1.8 మిలియన్లు ఉండగా..., 2.5 మిలియన్లు కుకీ కమ్యూనిటీకి చెందినవారు, నాగాలు 4 మిలియన్లు ఉన్నారు.

ఆ సమయంలో చెలరేగిన హింసలో 28 గ్రామాలు, అందులో మూడింట రెండు వంతుల నాగా గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చందేల్, సదర్ హిల్స్, ఉర్ఖుల్ జిల్లాల్లో గ్రామాలు శవాలదిబ్బగా మారాయి. శరణార్థులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే వారు వెళ్ళవలసిన మార్గం పూర్తిగా తిరుగుబాటు భూభాగం కావడం...రహదారిలోని ఈ భాగం ప్రత్యర్థి నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (NSCN-M)బర్మా-ఆధారిత కుకీ నేషనల్ ఆర్మీ (KNA) తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉంది .దాదాపు 300 మంది నాగా శరణార్థులు కుకీ తిరుగుబాటుదారులు తమ గ్రామాలపై దాడులకు పాల్పడటంతో నిరాశ్రయులయ్యారు. మగవాళ్ళు అడవుల్లోకి పారిపోయారు. ఆడవాళ్ళనూ విడిచిపెట్టారు. భద్రతా బలగాలు సాయం చేసేందుకు గ్రామాలు వెళ్తే...ఇళ్లలలోనుంచి బయటకు రాలేదు. భద్రతాదళాలు కూడా కుకీ వర్గానికి చెందినవారేనని తమపై దాడి చేస్తారన్న భయంలో వారిలో నెలకొంది.

ఈ హింసాకాండ సమయంలో మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రిన్స్ దొరేంద్ర సింగ్ ఉన్నారు. ఆ సమయంలో పీ.వి నరసింహారావు దేశ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన తన మంత్రివర్గం సలహా మేరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. ఆ సమయంలో హోం శాఖ సహాయ మంత్రి రాజేష్ పైలట్ (కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ తండ్రి) మణిపూర్‌కు మూడు గంటల పర్యటనకు వెళ్లారని, అందులో అతను రెండు గంటల పాటు విమానాశ్రయంలో ఉండి..ఒక గంట పాటు మాత్రమే పర్యటించారు. అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంతదారుణంగా ఉందో అర్థమవుతుంది. రాష్ట్రంలో పరిపాలనను అమలు చేయడంలో మణిపూర్ సీఎం దోరేంద్ర సింగ్ విఫలమయ్యారు.

మణిపూర్‌లో పలుమార్లు రాష్ట్రపతి పాలన విధించారు:
-తొలిసారిగా 1967 జనవరి 19 నుంచి 1967 మార్చి 19 వరకు 66 రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించారు. ఆ సమయంలో మణిపూర్ కేంద్ర పాలిత ప్రాంత శాసనసభకు తొలి ఎన్నిక జరగాల్సి ఉంది.

-రెండవసారి, 25 అక్టోబర్ 1967 నుండి 18 ఫిబ్రవరి 1968 వరకు 116 రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించారు. ఆ సమయంలో మణిపూర్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది, ఎందుకంటే ఆ సమయంలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ లేదు.

-రాష్ట్రంలో మూడవసారి అక్టోబర్ 17, 1969 నుండి మార్చి 22, 1972 వరకు రెండేళ్ల 157 రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించారు. వాస్తవానికి, ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా హింస వ్యాపించింది, అందుకే ప్రజలు పూర్తి రాష్ట్ర హోదాను డిమాండ్ చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయి

-మార్చి 28, 1973 నుండి మార్చి 3, 1974 వరకు నాలుగోసారి రాష్ట్రపతి పాలన విధించారు. ఆ సమయంలో ప్రతిపక్షాలకు తక్కువ మెజారిటీ ఉండడంతో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.

-ఐదవసారి, మే 16, 1977 నుండి జూన్ 28, 1977 వరకు 43 రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించారు. ఆ సమయంలో పార్టీ మారడంతో రాష్ట్ర ప్రభుత్వం పడిపోయింది.

-ఆరోసారి, రాజకీయ కారణాల వల్ల నవంబర్ 14, 1979 నుండి జనవరి 13, 1980 వరకు 60 రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించారు. అసంతృప్తి, అవినీతి ఆరోపణలతో ప్రభుత్వాన్ని రద్దు చేసి అసెంబ్లీని రద్దు చేశారు.

-ఫిబ్రవరి 28, 1981 నుండి జూన్ 18, 1981 వరకు ఏడవసారి రాష్ట్రపతి పాలన విధించారు. ఆ సమయంలో కూడా రాజకీయ కారణాల వల్ల రాష్ట్రంలో శాశ్వత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు.

-ఎనిమిదోసారి, జనవరి 7, 1992 నుండి ఏప్రిల్ 7, 1992 వరకు 91 రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించారు. అప్పట్లో పార్టీ మారడంతో సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది.

-తొమ్మిదోసారి, డిసెంబర్ 31, 1993 నుండి డిసెంబర్ 13, 1994 వరకు 347 రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించారు. ఆ సమయంలో నాగా, కుకీ వర్గాల మధ్య హింస చెలరేగింది. ఈ హింస చాలా కాలం పాటు కొనసాగింది, ఇందులో వందలాది మంది మరణించారు.

-జూన్ 2, 2001 నుండి మార్చి 6, 2002 వరకు 277 రోజుల పాటు పదవసారి రాష్ట్రపతి పాలన విధించారు. ఆ సమయంలో ప్రభుత్వం మెజారిటీ కోల్పోవడంతో పాలన విధించాల్సి వచ్చింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు