Delhi Heat Wave: ఢిల్లీలో వడగాడ్పులకు 192 మంది మృతి

దేశ రాజధాని ఢిల్లీలో ఎండల తీవ్రత, వడ గాడ్పులతో 192 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనే ఎన్జీవో తెలిపింది. వీరిలో 80 శాతం మంది ఎటువంటి ఆశ్రయం లేని వారేనని చెప్పింది. ఈ నెల 11 నుంచి 19వ తేదీల మధ్య అత్యధికంగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.

New Update
Delhi Heat Wave: ఢిల్లీలో వడగాడ్పులకు 192 మంది మృతి

Delhi Heat Wave: ఢిల్లీలో ఎండల తీవ్రత, వడ గాడ్పులకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల 11 నుంచి 19వ తేదీల మధ్య అత్యధికంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో వేడిగాలులకు తాళలేక 192 మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో 80 శాతం మంది ఎటువంటి ఆశ్రయం లేని వారేనని సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనే ఎన్జీవో తెలిపింది. ఇటువంటి వారికి తక్షణమే వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ చెప్పారు. గాలి కాలుష్యం, పారిశ్రామికీకరణ, అడవుల నరికివేత వంటివి ఉష్ణోగ్రతలు పెరగడానికి, గూడు లేని వారి ఇబ్బందులను పెంచాయని విశ్లేషించారు.

81లక్షల మంది మృతి..

2021లో ప్రపంచవ్యాప్తంగా వాయుకాలుష్యం కారణంగా 81 లక్షల మంది చనిపోయారని, ఇందులో భారత్‌లో 21 లక్షల మరణాలు నమోదయ్యాయని యూనిసెఫ్ భాగస్వామ్యంతో అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ (హెచ్ఐ) నివేదిక పేర్కొంది. 2021 సంవత్సరంలో భారత్‌లో ఐదేళ్లకన్నా తక్కువ వయసున్న 1,69,400 మంది చిన్నారులు వాయుకాలుష్యం వల్ల మరణించి నట్టు నివేదిక తెలిపింది.

2021లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మొత్తం మరణాల్లో 12 శాతం వాయు కాలుష్యం వల్లనేనని వివరించింది. ఈ మరణాలకు మించి, అనేక మిలియన్ల మంది ప్రజలు బలహీనపరిచే దీర్ఘకాలిక వ్యాధులతో జీవిస్తున్నారు.  ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు, సమాజాలపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తుందని పేర్కొంది. 

Advertisment
తాజా కథనాలు