Maharashtra : 24 గంటల్లో 18మరణాలు..ఆ ఆస్పత్రిలో అసలేం జరుగుతోంది?

మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో గత 24 గంటల్లో పద్దెనిమిది మంది రోగులు మరణించారు. ఈ ఘటనపై సమగ్ర వివరాలు కావాలని కోరుతూ ముఖ్యమంత్రి షిండే ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

author-image
By Bhoomi
New Update
Maharashtra : 24 గంటల్లో 18మరణాలు..ఆ ఆస్పత్రిలో అసలేం జరుగుతోంది?

మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ (Chatrapati Shivaji Maharaj Government Hospital) ఆస్పత్రిలో 24 గంటల్లోనే 18 మంది రోగులు మరణించిన ఘటన వెలుగులోకి వచ్చింది. థానేలోని కాల్వాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో గత 24 గంటల్లో పద్దెనిమిది మంది రోగులు మరణించారని మున్సిపల్ కమిషనర్ అభిజిత్ బంగర్ ఆదివారం తెలిపారు. వీరిలో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు ఉన్నారు. వీరిలో ఆరుగురు థానే నగరానికి చెందినవారు కాగా...నలుగురు కళ్యాణ్ నుండి ముగ్గురు, సహపూర్ నుండి ముగ్గురు, భివాండి, ఉల్హాస్‌నగర్, గోవండి (ముంబైలోని) నుండి ఒక్కొక్కరు ఉన్నారు. మృతుల వయస్సు 12 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుంది.

ఈ మరణాలపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (CM Eknath Shinde) పరిస్థితిపై ఆరా తీసినట్లు తెలిపారు. ఆసుపత్రి నుంచి వివరాలు కోరారు. మరణాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు సీఎం ఏక్ నాథ్ షిండే. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో నివేదిక కావాలంటూ ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి కమిషనర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నేతృత్వం వహిస్తారు. దీంతో పాటు కలెక్టర్, పౌరసరఫరాల శాఖాధికారి, ఆరోగ్య సేవల డైరెక్టర్‌లను ఇందులో చేర్చనున్నారు. ఈ కమిటీ మరణాలకు గల కారణాలను పరిశీలిస్తుంది.

ఈ రోగులకు కిడ్నీలో రాళ్లు, దీర్ఘకాలిక పక్షవాతం, అల్సర్లు, న్యుమోనియా, కిరోసిన్ పాయిజనింగ్, సెప్టిసిమియా వంటి సమస్యలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రోగులకు చికిత్స అందించిన తీరుపై విచారణ జరిపి మృతుల బంధువుల వాంగ్మూలాలను నమోదు చేస్తామన్నారు. అయితే మ్రుతుల కుటుంబ సభ్యలు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణించారని ఆరోపణలు చేయడంతో విచారణ కమిటీ దీనిని పరిశీలించనుంది.

మహారాష్ట్ర మంత్రి దీపక్ కేసర్కర్ మాట్లాడుతూ, ఈ ఆసుపత్రిలో ఐసియు సామర్థ్యాన్ని పెంచామని..పరిస్ధితి విషమించిన రోగులను కూడా చేర్చుకుంటున్నట్లు తెలిపారు.వారిని కాపాడేందుకు వైద్యులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారన్నారు. విచారణకు ఇప్పటికే ఓ కమిటీని వేశామని తెలిపిన మంత్రి దీపక్ కేసర్కర్ ...ఇవి సహజ మరణాలేనని...రోగి చివరి దశకు చేరుకుంటే వైద్యులు ఏం చేయలేరన్నారు. రోగి ఏ ఆసుపత్రికైనా వెళ్లవచ్చు కానీ ఏ స్థితిలో వెళుతున్నాడన్నది ముఖ్యమని తెలిపారు.

దీనికి ఒక రోజు ముందు, రాష్ట్ర ఆరోగ్య మంత్రి సావంత్, ఆసుపత్రి డీన్‌ను రెండు రోజుల్లో నివేదిక సమర్పించారు. చనిపోయిన 17 మందిలో మొత్తం 13 మంది ఐసీయూలో ఉన్నారని మంత్రి సావంత్ పూణేలో మీడియాకు తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఐదుగురు రోగులు ఆసుపత్రిలో మరణించారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డీన్‌ను కోరింది. డీన్‌ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఈ ఆసుపత్రి రాష్ట్ర వైద్య విద్య, పరిశోధన శాఖ పరిధిలోకి వస్తుంది. దాని మంత్రి హసన్ ముష్రిఫ్ ఆసుపత్రికి చేరుకుని, విషయాన్ని పరిశీలిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు