Gujarath: భారత ఫిషింగ్ బోట్ లో 173 కిలోల డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు అదుపులో! గుజరాత్ తీరంలోని భారత ఫిషింగ్ బోట్ నుంచి 173 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. గంజాయి నుంచి సేకరించిన రూ. 400 కోట్ల విలువైన 'హషీష్' సరాఫరా చేస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. By srinivas 29 Apr 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి ICG: గుజరాత్ తీరంలోని భారత ఫిషింగ్ బోట్ నుంచి 173 కిలోల డ్రగ్స్ ను ఇండియన్ కోస్ట్ గార్డ్(ICG) సోమవారం స్వాధీనం చేసుకుంది. ఐసీజీ, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ATS) సముద్రంలో నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా చేపల పడవను పట్టుకోగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయని తెలిపారు. అలాగే ఓడలోని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. Your browser does not support the video tag. రూ. 400 కోట్ల విలువైన డ్రగ్స్.. ఇక ఆదివారంనాడు ఏటీఎస్, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఐసీజీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్‌లో 14 మంది సిబ్బందితో కూడిన పాకిస్తాన్ బోటు నుంచి రూ. 600 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సోమవారం ఉమ్మడి ఆపరేషన్‌లో ఇద్దరు భారతీయులతో పాటు మొత్తం 173 కిలోల గంజాయి నుంచి సేకరించిన హషీష్ పట్టుబడింది. గత నెలలోనూ కోస్ట్ గార్డ్, ఎన్‌సీబీ, ఏటీఎస్ సంయుక్తంగా గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరంలో రూ. 400 కోట్ల విలువైన మెథాంఫెటమైన్ అనే అత్యంత సైకో-స్టిమ్యులెంట్ డ్రగ్‌ను పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ లో 6గురు పాకిస్తాన్ సిబ్బందిని తీసుకువెళుతున్న పడవను పట్టుకున్నట్లు చెప్పారు. #gujarat #173-kg-drugs-seized #indian-fishing-boat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి