165 లీటర్ల ఫ్రిజ్ కేవలం రూ.11వేలకే

మీరు తక్కువ ధరలో మంచి బ్రాండెడ్ ఫ్రిజ్ కొనాలనే ఆలోచనలో ఉంటే.. ఇది కొనుక్కోవచ్చు. దీనికి మంచి రేటింగ్ ఉంది. పూర్తి వివరాలు చూసి ఫైనల్ నిర్ణయం తీసుకోండి.

New Update
165 లీటర్ల ఫ్రిజ్ కేవలం రూ.11వేలకే

ఇది Haier కంపెనీ తయారుచేసిన 165 లీటర్ల, డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ ఫ్రిజ్. దీనికి 1 స్టార్ రేటింగ్ మాత్రమే ఉంది. ఇది 2024 మోడల్.దీనికి అమెజాన్‌‌లో 4/5 రేటింగ్ ఉంది. గత నెలలో ఈ ఫ్రిజ్‌ని 1000 మందికి పైగా కొన్నారు. అలాగే దీనిపై 1622 మంది రివ్యూలు ఇచ్చారు. వాటి ప్రకారం ఈ ఫ్రిజ్.. క్వాలిటీ, వాల్యూ, సైజ్, వైవిధ్యం, లుక్ చాలా బాగుంది. కూలింగ్, కరెంటు తక్కువగా వాడటం వంటివి కూడా పర్వాలేదు. ఐతే.. లీకేజ్ విషయంలో మాత్రం మైనస్ మార్కులు పడ్డాయి.

ఈ ఫ్రిజ్ చూడటానికి లుక్ బాగుంది. స్టైలిష్‌గా ఉంది. దీనికి బయటివైపు బార్ హ్యాండిల్ ఉండటం వల్ల.. డోర్ తెరవడం, ముయ్యడం తేలికే.ఈ ఫ్రిజ్‌కి 165 లీటర్ల కెపాసిటీ ఉండటం మరో గొప్ప విషయం. మార్కెట్‌లో 90 లీటర్ల ఫ్రిజ్ కూడా దాదాపు రూ.10వేలు ధర ఉంటోంది. అందువల్ల ఈ ఫ్రిజ్ తక్కువ ధరకే లభిస్తోంది అనుకోవచ్చు. ఇందులో ఫ్రీజర్ కెపాసిటీ 15 లీటర్లు ఉంది. ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీ 150 లీటర్లు ఉంది.

దీనికి 1 స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉంది. అంటే.. ఇది కరెంటు ఎక్కువగానే కాల్చుతుంది. 5 స్టార్ రేటింగ్ ఉండే ఫ్రిజ్‌లు మాత్రమే కరెంటు తక్కువగా కాల్చుతాయి. అందువల్ల కొనుక్కొనే వారు.. ఇది నెలకు ఎంత కరెంటు కాల్చుతుందో.. పూర్తి వివరాలు తెలుసుకొని.. నిర్ణయం తీసుకోవాలి. ఇది సంవత్సరానికి 215 కిలోవాట్ అవర్స్ కాల్చుతుందని తెలిపారు.ఈ ఫ్రిజ్‌పై 1 సంవత్సరం వారంటీ ఉంది. కంప్రెసర్‌పై 10 సంవత్సరాల వారంటీ ఉంది. ఈ ఫ్రిజ్‌ ఇన్వెర్టర్ ద్వారా పనిచెయ్యదని, పనిచేస్తుందని రెండు రకాలుగా తెలిపారు. దీనిపై క్లారిటీ తీసుకోవాలి. ఐతే.. ఈ ఫ్రిజ్‌కి స్టెబిలైజర్ అవసరం లేదని చెప్పారు.

ఈ ఫ్రిజ్‌లో 1 డ్రాయర్, 2 షెల్ఫ్‌లు, ఉన్నాయి. షెల్ఫులు వైర్ టైపువి. అలాగే పెద్ద కూరగాయల బాక్స్ ఇచ్చారు. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్ ఇచ్చారు.ఈ ఫ్రిజ్ బాగా ఐస్ అవుతుందని తెలిపారు. దీని సైజ్ చూస్తే.. పొడవు 62 సెంటీమీటర్లు కాగా.. వెడల్పు 10 సెంటీమీటర్లు, ఎత్తు 103.50 సెంటీమీటర్లు. బరువు 29 కేజీలు.

ఈ ప్రొడక్టుతో మీకు 1 రిఫ్రిజిరేటర్, 1 ఎగ్ ట్రే, 1 ఐస్ ట్రే, 1 యూజర్ మాన్యువల్, 1 వారంటీ కార్డు, కీస్ ఇస్తారు.ఈ ఫ్రిజ్ అసలు ధర రూ.14,990 కాగా.. అమెజాన్‌లో దీనిపై 27 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.10,990కి అమ్ముతున్నారు. మీరు దీన్ని EMI ద్వారా రూ.533కి పొందవచ్చు.

Advertisment
తాజా కథనాలు