Jobs: నిరుద్యోగులు ఈ బంపర్ న్యూస్ మీకోసమే..ఈ జాబ్ మేళాలో పాల్గొనండి..ఉద్యోగం పట్టండి..!! ప్రకాశం జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రైవేట్ ఉద్యోగాలను పొందే అవకాశాన్ని సర్కార్ కల్పిస్తోంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు అధికారులు.26-12-2023 రోజున 15 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. By Bhoomi 21 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ ఒంగోలు New Update షేర్ చేయండి AP Skill Universe: ఏపీలోని ప్రకాశం జిల్లా నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ,జిల్లా ఉపాధి కార్యాలయం, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఆవరణలో ఈనెల 26వ తేదీన 15 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో అపెక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్, మూత్తూట్ ఫైనాన్స్, స్కిల్ క్రాఫ్ట్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్, ఇంనోవ్ సోర్స్ యస్ బీఐ కార్డ్స్, యమహా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, యాజాకి, పేటిఎం, హెడెర్ డ్రట్స్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, కళ్లం టెక్స్ టైల్స్ వంటి కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ ఉద్యోగ మేళాలో సెలక్ట్ అయిన అభ్యర్థులకు జీతం నెలకు రూ. 10వేల నుంచి 25వేలు పొందే ఛాన్స్ ఉంటుంది. జిల్లాలో ఉన్న 18ఏళ్ల నుంచి 35ఏళ్ల వయస్సున్న యువతీ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఉద్యోగాల రిజిస్ట్రేషన్ కోసం https://skilluniverse.apssdc.in లోకి వెళ్లి అక్కడ “REGISTRATION” పై క్లిక్ చేసి మీరు పేరు ను నమోదు చేసుకోవాలి. ఇదే కాకుండా AP Skill Universe మొబైల్ యాప్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనే యువతీయువకులు ఆదార్ కార్డు జిరాక్స్, బయోడెటా ఫార్మ్, రెస్యూమ్ తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డు కొరకు లాగిన్ లోకి డౌన్ లోడ్ చేసుకుని శ్రీఆర్ లోకనాదం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, APSSDC, ప్రకాశం జిల్లా తెలిపారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్: 99888 53335 లేదా మొబైల్ నం 91005 66581 ,70139 50097 నెంబర్ల ను సంప్రదించవచ్చని తెలిపారు. ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. మరో 11 రోజులే ఛాన్స్! ఇండియన్ నేవీ(Indian Navy) లో 910 సివిలియన్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకి అర్హులని ఇండియన్ నేవీ పేర్కొంది. వీటిని ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా పూరించనున్నారు. అర్హత ఉన్న ఆసక్తిగల యువతీయువకులు ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఛార్జ్‌మెన్ వర్క్‌షాప్ పోస్టుల వివరాలు..ఇందులో మొత్తం 22 ఖాళీలు ఉన్నాయి. దీనికి కావాల్సిన విద్యార్హతలు..బీఎస్సీ మ్యాథ్స్/ఫిజిక్స్/ కెమిస్ట్రీ చదివి ఉండాలి. లేక కెమికల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా పూర్తి చేసి అయినా ఉండాలి. ఛార్జ్‌మెన్ ఫ్యాక్టరీ పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.20 ఛార్జ్‌మెన్ ఫ్యాక్టరీకు కావాల్సిన విద్యార్హతలు..బీఎస్సీ మ్యాథ్స్/ ఫిజిక్స్/ కెమిస్ట్రీ చదువు పూర్తి చేసి ఉండాలి. లేకపోతే ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/కంప్యూటర్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసి అయిన ఉండాలని అధికారులు చెబుతున్నారు. సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టులకు కూడా నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి కావాల్సిన విద్యార్హతలు ఎలక్ట్రికల్, మెకానికల్ కార్టోగ్రాఫిక్ వంటి విద్యను అభ్యసించి ఉండాలి. సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ కు కావాల్సిన విద్యార్హతలు..పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. రెండేళ్ల డిప్లొమా, డ్రాఫ్ట్‌మెన్‌షిప్ లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. దరఖాస్తు చేసుకున్న విభాగం ప్రకారం..ఎలక్ట్రికల్/మెకానికల్/ నేషనల్ ఆర్కిటెక్చర్/కార్టోగ్రఫీ వీటిలో ఎందులో అయినా సరే మూడేళ్లు డ్రాయింగ్/ డిజైన్ అనుభవం తప్పనిసరిగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. డ్రాఫ్ట్స్‌మెన్ మేట్ పోస్టుల వివరాలు…వెస్ట్రన్ నేవల్ కమాండ్–565 సదరన్ నేవల్ కమాండ్- 36 ఈస్టర్న్ నేవల్ కమాండ్ -9 పోస్టులు ఉన్నాయి. దీనికి కావాల్సిన విద్యార్హతలు.. పదో తరగతి పాస్ అవ్వడంతో పాటు ఐటీఐ నిర్దేశిత ట్రేడుల్లో సర్టిఫికేట్ తప్పనిసరి ఉండాలి. ఈ పోస్టులను అప్లై చేసుకునేందుకు 2023 డిసెంబర్ 31 నాటికి సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ లకు 27 ఏళ్లు మించకూడదు. ఛార్జ్‌మెన్,,ట్రేడ్స్‌మెన్ మేట్ పోస్టులకు అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. ఇందులో ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయో పరిమితి సడలింపులు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. మిగతా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ. 295 లను చెల్లించాల్సి ఉంటుంది. 2023 డిసెంబరు 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.పూర్తి వివరాల కోసం భారత నేవీ అధికారిక వెబ్సైట్ https://www.joinindiannavy.gov.in/ను చూడవచ్చు. ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్! #jobs #apssdc #apssdc-job-mela-2023 #ap-skill-universe మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి