BIG Breaking: ఘోర ప్రమాదం.. 18 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యాను అదుపుతప్పి బోల్తాపడటంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

New Update
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యాను అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈదుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. కబిర్దామ్‌ జిల్లా కవార్ధా పట్టణంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సెమ్హరా గ్రామానికి చెందిన గిరిజనులు తునికాకు సేకరణకు సమీపంలో అడవికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వాళ్లు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్ కుక్‌దూర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక్కసారిగా అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది.

Also read: అహ్మదాబాద్‌లో నలుగురు టెర్రరిస్ట్ లను అరెస్ట్ చేసిన కేంద్ర నిఘా సంస్థ..

దీంతో 18 మంది ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో 25 నుంచి 30 మంది ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు