Remal : రెమాల్‌ తుపాన్‌ ఎఫెక్ట్‌... 14 విమానాలు రద్దు.. ఎక్కడంటే!

పశ్చిమ బెంగాల్‌ లో రెమాల్‌ తుపాన్‌ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఇప్పటికే ఈ తుపాన్ ధాటికి ఇద్దరు మృతి చెందగా..చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

New Update
Deadly Cyclones In World : ప్రపంచాన్ని వణికించిన 5 భారీ తుపానులు ఇవే.. ప్రాణ నష్టం వేలల్లో కాదు లక్షల్లో..!

Cyclone Remal Effect : పశ్చిమ బెంగాల్‌ (West Bengal) లో రెమాల్‌ తుపాన్‌ (Cyclone Remal) బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఇప్పటికే ఈ తుపాన్ ధాటికి ఇద్దరు మృతి చెందగా.. చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. రెమాల్‌ తుపాన్‌ నేపథ్యంలో గౌహతి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్ నుంచి కోల్‌ కతాకు వెళ్లే 14 విమానాలను అధికారులు రద్దు చేశారు.

ఇండిగో (Indigo) నిర్వహిస్తున్న నాలుగు విమానాలు, అలయన్స్ ఎయిర్‌కు చెందినవి నాలుగు, ఎయిర్ ఇండియా (Air India) కు చెందిన ఒకటి రద్దు చేసినట్లు అధికారులు వివరించారు. రెమల్ తుఫాను కారణంగా, స్పైస్‌జెట్ క్యారియర్ ఒక విమానాన్ని గౌహతిలో నిలిపివేసింది. “తుపాను సమీపిస్తున్నందున, ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నివారణ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. తీవ్ర తుపానులకు సిద్ధంగా ఉన్నందున ఈ అంతరాయం ఉన్న సమయంలో ప్రయాణికులు ఎయిర్‌లైన్ అప్‌డేట్‌లను పర్యవేక్షించాలని, జాగ్రత్త వహించాలని ” అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. రెమాల్ తుఫాను కారణంగా అస్సాం, మేఘాలయాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. గౌహతిలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారి ఒకరు మాట్లాడుతూ, “అసోంలోని చాలా జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది మరో రెండు రోజులు కొనసాగుతుంది. ఒకటి లేదా రెండు జిల్లాలు మినహా మేఘాలయలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

Also read: ఛాంపియన్‌కు జ్వెరెవ్ షాక్.. ఫ్రెంచ్ ఓపెన్‌ ఫస్ట్ రౌండ్‌లోనే నాదల్ ఔట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు