శ్రీలంకలో 137 మంది భారతీయుల అరెస్ట్!

ఆన్‌లైన్‌లో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న137మంది భారతీయులను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు.శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ద్వారా పరిచయమైన వ్యక్తి చేతిలో మోసపోయి డబ్బు పోగొట్టుకున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటకి వచ్చింది.

శ్రీలంకలో 137 మంది భారతీయుల అరెస్ట్!
New Update

మన పొరుగు దేశం కొలంబో, శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ద్వారా సంప్రదించిన వ్యక్తికి డబ్బు పోగొట్టుకున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ కేసుకు సంబంధించి, పెరదానై ప్రాంతంలో నివసిస్తున్న ఒక తండ్రి  కొడుకును అనుమానాస్పదంగా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

విచారణలో వీరు ఆన్‌లైన్‌లో చీటింగ్‌లు, అక్రమ గ్యాంబ్లింగ్‌కు పాల్పడుతున్నారని, దీని వెనుక పెద్ద ముఠానే పనిచేస్తున్నట్లు తేలింది. వారు అందించిన సమాచారం మేరకు పోలీసులు నిన్న కొలంబో శివారులోని నెగోంబోలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.

అక్కడ అనుమానాస్పద విలాసవంతమైన బంగ్లాపై దాడి చేయగా.. 13 మంది పట్టుబడ్డారు. వారి నుంచి 57 మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం జరిగిన దాడిలో పలువురు పట్టుబడ్డారు. వారి నుంచి మొత్తం 135 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.అరెస్టయిన వారిలో 137 మంది భారతీయులేనని పోలీసులు తెలిపారు. మరి కొందరికి దుబాయ్, ఆఫ్ఘనిస్థాన్‌లతో సంబంధాలున్నాయని చెబుతున్నారు.

#financial-fraud
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe