టీ డయాగ్నొస్టిక్ సెంటర్స్‌లో 134 పరీక్షలు ప్రారంభం

బీఆర్ఎస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ప్రారంభించిన టీ-డయాగ్నొస్టిక్స్‌లో 134 వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సెంటర్లలో 134 పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. అదే విధంగా వాటి రిపోర్టులను సెల్ ఫోన్‌కు పంపిస్తారు. 31 జిల్లాల్లో ఈ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా పరీక్ష కేంద్రాలు..రేడియాలజీ సెంటర్లు తెలంగాణలో ప్రారంభించారు.

New Update
టీ డయాగ్నొస్టిక్ సెంటర్స్‌లో 134 పరీక్షలు ప్రారంభం

134 tests started at Tdiagnostic Centers

మెరుగైన సేవలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 134 ఫ్రీ మెడికల్ టెస్టులు సీంఎం కేసీఆర్ సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వైద్య పరీక్షలను ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు వర్చువల్‌గా ప్రారంభించారు. తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ ద్వారా ఇప్పటివరకు 54 పరిక్షలు ఫ్రీగా చేసేవారు. తాజాగా 134 వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరోగ్య తెలంగాణ కోసం కృషిచేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వైద్య సైవలు, పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతున్నాయని తెలిపారు. అన్ని పీహెచ్‌సీల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం లేదని తెలిపారు.

ప్రభుత్వాస్పత్రులల్లో అత్యాధునిక వైద్యం

తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ ద్వారా ఇప్పటివరకు 54 పరిక్షలు ఫ్రీగా చేసేవారు. ఇప్పుడు వాటి సంఖ్య 134కి పెరిగింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో టీ-డయాగ్నొస్టిక్స్‌ కేంద్రాలు, రేడియాలజీ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి అన్నారు. మరో రెండు జిల్లాల్లో పనులు జరుగుతున్నాయని, త్వరలోనే వాటిని కూడా పూర్తిచేస్తామన్నారు. కరోనా సమయంలో వైద్యులు ప్రాణాలకు తెగించి పనిచేశారని, ప్రజలను మహమ్మారిబారినుంచి రక్షించారని వెల్లడించారు. రాష్ట్రంలో వైద్యుల పనితీరు అద్భుతంగా ఉందన్నారు. ప్రభుత్వాస్పత్రులను కార్పొరేట్‌ స్థాయి ఆస్పత్రులకు దీటుగా మార్చి.. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చారని అభినందించారు. పేద ప్రజలకు నిమ్స్‌లో అత్యాధునిక వైద్యం అందిస్తున్నట్లు వివరించారు.

ప్రజాప్రతినిధులు పని చేయాలి

ప్రజలు ప్రభుత్వాస్పత్రులుకు వచ్చే విధంగా ప్రజాప్రతినిధులు పని చేయాలని సూచించారు మంత్రి హరీష్‌రావు. ఆరోగ్య మహిళ, కేసీఆర్ కిట్, న్యూట్రషన్ కిట్ లాంటి పథకాలతో ప్రభుత్వాస్పత్రిలో డెలివరీల సంఖ్య పెరిగిందన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో రోబోటిక్ మెషిన్‌ని కూడా ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు మంత్రి హరీష్‌రావు.

Advertisment
Advertisment
తాజా కథనాలు