Missing: కరీంనగర్ లో 13 ఏళ్ల బాలిక మిస్సింగ్.. ఐదు బృందాలతో గాలింపు

కరీంనగర్ లో బాలిక తప్పిపోయిన సంఘటన కలకలం రేపుతోంది. బుధవారం మధ్యాహ్నం 13 ఏళ్ల వశిష్ట క్రిష్ణను తన తాతయ్య పెద్దపల్లిలో బస్సు ఎక్కించగా ఆమె బస్టాండ్ లో కాకుండా బైపాస్ లో దిగినట్లు గుర్తించిన పోలీసులు 5బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. అచూకీ తెలిస్తే.. 99126679579

New Update
Missing: కరీంనగర్ లో 13 ఏళ్ల బాలిక మిస్సింగ్.. ఐదు బృందాలతో గాలింపు

Missing : కరీంనగర్ జిల్లాలో ఓ బాలిక తప్పిపోయిన సంఘటన కలకలం రేపుతోంది. బుధవారం మధ్యాహ్నం 13 ఏళ్ల వశిష్ట క్రిష్ణ (Vashishtha Krishna) ను తన తాతయ్య పెద్దపల్లిలో బస్సు ఎక్కించాడు. ఆ బస్సు నంబర్ ఆమె తండ్రికి పంపించాడు. అయితే కరీంనగర్ బస్టాండ్ లో ఎదురుచూస్తున్న తండ్రికి ఆమె బస్సులో కనిపించలేదు. దీంతో వెంటనే ఆమె కుంటుంబ సభ్యులు కరీంనగర్ లోని రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైట్ ఇచ్చారు. వెంటనే ఐదు బృందాలతో గాలింపు చర్యలు మొదలుపెట్టిన పోలీసులు.. ఆమె కరీంనగర్ లోని మంచిర్యాల్ చౌరస్తాలో దిగాల్సివుండగా బైపాస్ ఫ్లై ఓవర్ వద్ద దిగినట్లు సీసీపుటేజీ ఆధారంగా గుర్తించారు.

ఇది కూడా చదవండి : Srikanth: హీరోయిన్లతో ఎఫైర్స్ పై శ్రీకాంత్ ను నిలదీసిన డైరెక్టర్.. ఊహ డివోర్స్ అడిగింది నిజమేనా!

ఇక తమ కూతురు ఎక్కడికి వెళ్లిందో, ఏమైపోయిందో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డ ఆచూకీ కోసం కన్నీరుమున్నీరవుతున్నారు. అచూకీ తెలిసిన వారు - 99126679579 నెంబరుకు ఫోన్ చేయాలని వేడుకుంటున్నారు.  ఇక ఆ అమ్మాయికోసం కరీంనగర్ పట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో పోలీసులు వెతుకుతున్నారు. ఆ బాలిక కావాలనే బస్సు దిగిందా? లేక ఎవరైనా కావాలనే ఈ చర్యకు పాల్పడ్డారా? కిడ్నాప్ చేశారా? అనే కోణాల్లో పోలసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతుండగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు