13 ఏళ్ల బాలికతో పెళ్లి.. పది రోజులుగా అత్యాచారం చేసి
13 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకుని పదిరోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డ దారుణమైన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో కలకలం రేపింది. భర్త అరాచకం తట్టుకోలేక తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.