దీపావళి రోజున ఎన్ని దీపాలు వెలిగించాలో తెలుసా..అవి ఎక్కడ ఉంచాలంటే!

దీపావళి పండగ నాడు 13 దీపాలను వెలిగించాలని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంటికి ఎంతో శ్రేష్ఠమని వారు సూచిస్తున్నారు.

New Update
దీపావళి పండుగ వేళ ఉచితంగా మద్యం, పటాకులు..ఎక్కడో తెలుసా!

Diwali: చిన్న పెద్ద వయసుతో తేడా లేకుండా దీపావళి పండుగను జరుపుకుంటుంటారు. సాయంత్రం వేళ దీపాలను (Lamps) వెలిగించి టపాకాయలు కాల్చుతూ స్వీట్లు పంచుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారు. దీపావళి అంటేనే దీపాల వరస అని అర్థం. దీపావళి రోజునే దీపాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది.

చీకట్లు పారద్రోలి వెలుగులు నింపేందుకు గుర్తుగా ఈ దీపాలను వెలిగిస్తూంటారు. అయితే ఈ దీపాలను వెలిగించి ఓ వరుసలో పెట్టడానికి కూడా పండుగ నాడు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే దీపావళి (Diwali) నాడు ఎన్ని దీపాలను వెలిగించాలి అనేది కూడా పండితులు వివరిస్తున్నారు.

దీపావళి నాడు 13 దీపాలను వెలిగించాలని వారు వివరిస్తున్నారు. ఆ దీపాలను కూడా ఎక్కడపడితే అక్కడ వెలిగించకూడదు. ఇంటి ఆవరణలో 13 దీపాలను ఎక్కడ ఎలా వెలిగించాలో తెలుసుకుందాం. లక్ష్మీదేవికి (Laxmi Devi) పూజ చేసే సమయంలో పదమూడు దీపాలను వెలిగించాలి.

Also read: ఎన్నికల కమిషన్ షాకింగ్ నిర్ణయం.. దీపావళి సెలవు రద్దు!

ప్రతి ఇంట్లోనూ శుభాలు జరగాలని కోరుకుంటూ రెండో దీపం వెలిగించాలి. సంపదకు, విజయాలకు లోటుపాట్లు ఉండకూడదని కోరుకుంటూ మూడో దీపం వెలిగించాలి. తులసి కోట ముందు నాలుగో దీపం పెట్టాలి. ఇంటి ముందు ఐదో దీపం వెలిగించాలి. ఆరో దీపాన్ని చెట్టు కింద ఉంచి వెలిగించాలి.

ఏడో దీపాన్ని దేవాలయంలో వెలిగించాలి. ఇంట్లో ఉన్న చెత్త దగ్గర ఎనిమిదో దీపాన్ని వెలిగించాలి. ఇంటి బాత్రూమ్‌ వెలుపల తొమ్మిదో దీపాన్ని వెలిగించాలి. పదో దీపాన్ని ఇంటి పై కప్పు మీద ఉంచాలి. కిటికీలో పదకొండో దీపాన్ని వెలిగించాలి. ఇంటి పై అంతస్థులో 12 వ దీపం ఉంచాలి. ఇంటి మధ్యలో 13 వ దీపాన్ని వెలిగించాలి.

ఈ పదమూడు దీపాలను ఇంటి వద్ద వెలిగించడం అనేది అంతే శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇలా పదమూడు దీపాలను వెలిగిస్తే అనుకున్న కోరికలు నెరవేరతాయని చెబుతున్నారు. దీపాలు వెలిగించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని కూడా పండితులు సూచిస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా అన్ని జాగ్రత్తులు తీసుకోవాలని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు