కర్ణాటకలోని చిక్ బళ్ళాపూర్ సమీపంలో పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆగి ఉన్న లారీని టాటా సుమో ఢీ కొని 13 మంది అక్కడిక్కడే మరణించారు. టాటా సుమోలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. దేశం మొత్తం వాతావరణం మారింది. ఈ నేపథ్యంలో పొగ మంచు భారీగా ఉంటోంది. దాని కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సుమోలు ఉన్నవారంతా శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలంలోని సమీప పల్లెలకు చెందిన వారిగా గుర్తించారు. పండుగ కోసం ఊరికి వచ్చి తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారంతా బెంగళూరులో కూలి పనులకు వెళ్లే కూలీలుగా గుర్తించారు.
Also Read:టార్గెట్ రాజగోపాల్ రెడ్డి.. నేడు మునుగోడు గడ్డపై కేసీఆర్ మీటింగ్!
తెల్లవారుజామున పొగమంచు ఉండటంతో డ్రైవర్ నరసింహులు ఆగి ఉన్న ట్యాంకర్ ను గమనించలేదు. దీంతో నేరుగా వెళ్ళి దాన్ని సుమో దాన్ని ఢీకొంది. మృతుల్లో 8మంది మగవారు, ఒక బాలుడు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు విశాఖలో కూడా వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 3 నెలల వ్యవదిలో 10 ప్రమాదాలు జరగ్గా అందులో 9మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తాజాగా నిన్న అర్ధరాత్రి తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై మరో ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు మృతి చెందారు. ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్ర గాయలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇక్కడ జరుగుతున్న ప్రమాదాల్లో యువకులే అధికంగా మరణిస్తున్నారు. అతివేగమే ప్రమాదాలకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఎన్ని ఆంక్షలు, నిబంధనలు పెట్టినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని చెబుతున్నారు.