Britain: అక్రమ వలసదారుల పై బ్రిటన్‌ ఉక్కుపాదం.. 12 మంది భారతీయుల అరెస్ట్‌!

బ్రిటన్‌ లోని పరిశ్రమల్లో అక్రమంగా పని చేస్తున్న 12 మంది భారతీయులను ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. వెస్ట్‌ మిడ్‌ల్యాండ్స్‌ ప్రాంతంలో అధికారులు నిర్వహించిన సోదాల్లో 12 మంది భారతీయులను అరెస్ట్‌ చేసినట్టు యూకే హోం శాఖ వెల్లడించింది.

Britain: అక్రమ వలసదారుల పై బ్రిటన్‌ ఉక్కుపాదం.. 12 మంది భారతీయుల అరెస్ట్‌!
New Update

12 Indians arrested in UK: బ్రిటన్‌ లోని పరిశ్రమల్లో అక్రమంగా పని చేస్తున్న 12 మంది భారతీయులను ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు (Immigration officers) అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. వెస్ట్‌ మిడ్‌ల్యాండ్స్‌ ప్రాంతంలో అధికారులు నిర్వహించిన సోదాల్లో 12 మంది భారతీయులను అరెస్ట్‌ చేసినట్టు యూకే హోం శాఖ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘కేక్‌ ఫ్యాక్టరీలో అరెస్టయిన నలుగురు భారతీయులు వీసా నిబంధనలను ఉల్లంఘించారు.

మొత్తం నిందితుల్లో నలుగురిని దేశం నుంచి బహిష్కరించడమా లేదా ఇండియాకు తిప్పి పంపడమా అనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.మిగతా 8 మందికి క్రమం తప్పకుండా హోం శాఖ ఆఫీసులో రిపోర్ట్‌ చేయాలనే నిబంధన మీద బెయిల్‌ ఇచ్చాం’ అని హోం శాఖ తెలిపింది. అంతేకాకుండా భారతీయులతో అక్రమంగా పని చేయించుకుంటున్న పరిశ్రమలకు జరిమానాలు విధిస్తామని అధికారులు తెలిపారు.

అక్రమ వలసదారులను అరికట్టాలని సునాక్‌ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో విదేశీయులకు వీసా నిబంధనలు సైతం కఠినతరం చేశారు.

Also Read: కలెక్టర్‌ కి అయినా తప్పని కొడుకు అల్లరి తిప్పలు!

#india #britan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe