JOBS: పది అర్హతతో ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

'ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' చెన్నైలోని వివిధ విమానాశ్రయాల్లో 119 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లకు చెందిన అభ్యర్థులు 2024 జనవరి 26 వరకూ అప్లై చేసుకోవాలని సూచించింది.

New Update
JOBS: పది అర్హతతో ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

JOBS: టెక్నికల్ అండ్ మెకానికల్ ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న అశావాహులకు 'ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' (AAI) గుడ్ న్యూస్ చెప్పింది. చెన్నై (chennai)ని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సదరన్‌ రీజియన్‌ పరిధిలోని విమానాశ్రయాల్లో వివిధ 119 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్‌/ సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం అర్హత కలిగిన అభ్యర్థులనుంచి ధరఖాస్తులు ఆహ్వానించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లకు చెందిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు.

అర్హతలు:
ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 2023 డిసెంబర్ 20 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు, కేటగిరీని బట్టి.. ఏఏఐ ఉద్యోగులు, దివ్యాంగులకు 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్‌, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌/ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌, డ్రైవిండ్‌ టెస్ట్‌ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అన్‌-రిజర్వుడ్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1000. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, పీడబ్ల్యూబీడీ, ఏఏఐలో ఏడాదిపాటు అప్రెంటిషిప్‌ శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. పోస్టులను బట్టి విద్యార్హతలు, ఎంపిక విధానాలు వేరుగా ఉంటాయి.

జూనియర్‌ అసిస్టెంట్‌ (ఫైర్‌ సర్వీసెస్‌): 73
పదో తరగతి, మూడేళ్ల రెగ్యులర్‌ మెకానికల్‌/ ఆటోమొబైల్‌/ ఫైర్‌ డిప్లొమా పాసవ్వాలి. లేదా ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ కింద ఈ పోస్టులను ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు కేటాయించారు. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి/ ఈ ఉద్యోగ ప్రకటనకు ఏడాది ముందు నుంచీ మీడియం వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. లేదా ఈ ఉద్యోగ ప్రకటనకు రెండేళ్ల ముందు నుంచీ లైట్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. టెంపరరీ, లెర్నింగ్‌ లైసెన్స్‌లను అనుమతించరు. అభ్యర్థులకు దృష్టి, వినికిడి సమస్యలు ఉండకూడదు. పురుష అభ్యర్థుల ఎత్తు 167 సెం.మీ. ఉండాలి. ఛాతీ 81 సెం.మీ. ఉండి, గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. పెరగాలి. బరువు 55 కేజీలు ఉండాలి. మహిళా అభ్యర్థుల ఎత్తు 157 సెం.మీ., బరువు 45 కేజీలకు తక్కువ కాకుండా ఉండాలి.
ఎంపిక: స్టేజ్‌-1లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహిస్తారు. వ్యవధి 2 గంటలు. దీంట్లో యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి.

ఇది కూడా చదవండి : Ranbir Kapoor: ‘జై మాతా ది..’ హిందూ మనోభావాలను దెబ్బతీశాడంటూ యనిమల్‌ హీరోపై ఫిర్యాదు!

స్టేజ్‌-1 :
ప్రశ్నపత్రం 10వ తరగతి స్థాయిలో ఉంటుంది. 50 శాతం ప్రశ్నలు బేసిక్‌ మ్యాథమెటిక్స్‌, బేసిక్‌ సైన్స్‌, ఎలిమెంటరీ ఇంగ్లిష్‌/ గ్రామర్‌ల నుంచి ఉంటాయి. పార్ట్‌-బిలో 50 శాతం ప్రశ్నలు జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ నుంచి అడుగుతారు. ప్రశ్నలు 12వ తరగతి స్థాయిలో ఉంటాయి.

స్టేజ్‌-2:
సీబీటీ పాసైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దీంట్లో పాసైతే డ్రైవింగ్‌, ఫిజికల్‌ ఎండ్యురెన్స్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు.

ఫిజికల్‌ ఎండ్యురెన్స్‌ టెస్ట్‌:
1. దీంట్లో భాగంగా 100 మీటర్ల రన్నింగ్‌, రోప్‌, పోల్‌ క్లైంబింగ్‌, హ్యూమన్‌ డమ్మీతో 60 మీటర్ల రన్నింగ్‌, నిచ్చెన ఎక్కడం ఉంటాయి. ప్రతి టెస్ట్‌కూ 20 మార్కులు. 2. జూనియర్‌ అసిస్టెంట్‌ (ఆఫీస్‌): 2 పోస్టులు. డిగ్రీ పాసవ్వాలి. ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. వ్యవధి 2 గంటలు. రాత పరీక్షలో పాసైన అభ్యర్థులకు ఎంఎస్‌-ఆఫీస్‌లో కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్‌ నిర్వహిస్తారు. 50 శాతం ప్రశ్నలు విద్యార్హతల సబ్జెక్టులకు సంబంధించినవి ఉంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌లో 50 శాతం ప్రశ్నలు అడుగుతారు. ఈ పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు. వీరు సీబీటీలో 40 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. 3. సీనియర్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రానిక్స్‌): 25 ఖాళీలు. ఎలక్ట్రానిక్స్‌/ టెలికం/ రేడియో ఇంజినీరింగ్‌ డిప్లొమా, సంబంధిత విభాగంలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. వ్యవధి 2 గంటలు.
విద్యార్హతలకు సంబంధించిన సబ్జెక్టుల నుంచి 70 శాతం ప్రశ్నలు అడుగుతారు. నరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ నుంచి 30 శాతం ప్రశ్నలు ఇస్తారు. యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి. 4. సీనియర్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌): 19 పోస్టులు. బీకామ్‌ పాసై.. రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌ తయారీ, ట్యాక్సేషన్‌, ఆడిట్‌, ఫైనాన్స్‌, అకౌంట్స్‌ రంగాల్లో పరిజ్ఞానం ఉండాలి.

ఎంపిక:
కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షకు 100 మార్కులు. వ్యవధి 2 గంటలు. ఎంఎస్‌-ఆఫీస్‌లో కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్‌ ఉంటుంది. సీబీటీలో అర్హత సాధించినవారికి కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. సీబీటీలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. విద్యార్హతలకు సంబంధించిన సబ్జెక్టుల నుంచి 70 శాతం ప్రశ్నలు ఇస్తారు.
30 శాతం ప్రశ్నలు జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ నుంచి అడుగుతారు. యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి.

ఆన్‌లైన్‌ అప్లై చివరి తేదీ: 2024 జనవరి 26

పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ సంప్రదించండి : http://www.aai.aero/

Advertisment
తాజా కథనాలు