Railway jobs: ఇంటర్ అర్హతతో రైల్వేలో 11,250 ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలివే!

భారతీయ రైల్వేశాఖ నుంచి మరో భారీ నోటిఫికేషన్ వెలువడనుంది. 11,250 టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లోనే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సమాచారం.

New Update
Railway Jobs : ఉద్యోగార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రైల్వే రిక్రూట్‌మెంట్‌పై కీలక ప్రకటన!

Railway Recruitment 2024: నిరుద్యోగులకు భారత రైల్వే మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. ఇటీవలే రెండు భారీ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన ఇండియన్ రేల్వే శాఖ తాజాగా మరో ఉద్యోగ ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 11,250 టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలకు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు దరఖాస్తులు ఆహ్వానించగా.. తాజా నోటిఫికేషన్ కు సంబంధించిన విదివిధానాలను సెప్టెంబర్‌లో ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

విద్యా అర్హతలు :
ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పరీక్ష పద్ధతిలోనే ఉద్యోగాల నియామకం ఉంటుంది.

వయసు:
రైల్వే టిసి అభ్యర్థుల వయసు 18 నుండి 30 ఏళ్లలోపు వుండాలి. ఎస్పీ, ఎస్టీ, ఓబిసి అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.

భౌతిక ప్రమాణాలు..
ఈ ఉద్యోగంలో అభ్యర్థుల భౌతిక ప్రమాణాలను పరిశీలిస్తారు. నిర్దిష్ట ఎత్తుతో పాటు దృష్టిలోపం లేకుండా వుండాలి. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ ఉంటుంది.

నెలవారి వేతనం..
ఉద్యోగంలో చేరగానే నెలకు రూ.35,000 వేల వేతనం ఉంటుంది.

మరిన్ని వివరాలకు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించండి. www.indianrailways.gov.in

Advertisment
తాజా కథనాలు