మాయలేడీ మాయలో 11 మంది యువకులు బలి ఈ సమాజం అంతా మాయ ప్రపంచం అయిపోయింది. విలాసాల జీవితాల కోసం ఒకరుని మించి ఒకరు మోసం చేయడం బాగా అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడు కూడా ఓ మాయలేడి చేతిలో 11 మంది యువకులు బలయ్యారు. పెళ్లి చేసుకున్నట్లు నటించి కొన్ని రోజులు ఉండి.. తర్వాత డబ్బు..నగలుతో పారిపోయింది. విషయం తెలుసుకున్న మూడో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By Vijaya Nimma 04 Jul 2023 in లైఫ్ స్టైల్ తెలంగాణ New Update షేర్ చేయండి పెద్దపల్లి జిల్లా రామగుండం అన్నపూర్ణ చెందిన రేవంత్ అనే కిళ్లి కొట్టు యువకునికి అప్పటికే పెళ్లి జరిగి విడాకులు అయింది. అయితే ఓ షాదీ డాట్ కామ్ ద్వారా వరంగల్ జిల్లా కు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇలా ఏర్పడిన పరిచయం కాస్తా సెల్ ఫోన్లలో ముచ్చట్లు..కుదిరితే కప్పు కాఫీ ఇలా కాస్తా పెళ్లి వరకు వచ్చాయి. ఇదే మొదటి పెళ్లి అంటూ సదరు యువతి నమ్మించింది. ఇంకేముందీ రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు పెళ్లి కుదిర్చారు. వెంటనే మన ఎన్టీపీసీలోని చిలుకలయ్య టెంపల్ సింపల్‌గా వివాహం చేసుకుని కొత్త కాపురం ప్రారంభించారు. నిత్యం వేధింపులు ఇంకేముంది మాయ లేడీ తన కిలాడీలను ప్రదర్శించటం ప్రారంభించింది. తనకు మందు, సిగరేట్లు కావాలంటూ పాన్ షాప్ యువకుడిని నిత్యం వేధింపులకు గురిచేసింది. ఇదేంటనీ మనోడు అంతా సీన్ రివర్స్ అవుతుందని తనలో తానే ఆవేదన చెందాడు. అలవాటైన యువతి మద్యం, సిగరేటు ఘాటుతో చాటుమాటుగా ఎంజాయ్ చేసింది. విషయం తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. రెండు నెలల తరువాత యువతి తన అక్క దగ్గరికి వెళ్తున్నానంటూ ఇంట్లో ఉన్న 70వేల నగదు, 4 తులాల గోల్డ్ ఆభరణాలో బిచానా ఎత్తేసింది. తిరిగి రాకపోవడంతో మనోడు ఆమె బంధువులకు, మిత్రులను ఆరా తీసాడు. అసలు విషయాలు ఫోటోలతో బయటపడ్డాయి. దాడి చేసి మరి బెదిరింపులు అయితే ఈమెకు అప్పటికే మూడు పెళ్లిలు అయ్యాయని, చాలా మందితో పరిచయాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. చివరకు అడ్రస్ తెలుసుకుని వెళ్లడంతో సదరు యువతి తన మిత్రులతో విందు విలాసాలతో కనిపించింది. ఏకంగా వారందరూ పాన్ షాప్ యువకుడిపై దాడి చేసి, వాటిని వీడియో తీశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు గురిచేసి, డబ్బుల కోసం డిమాండ్ చేశారు. దీంతో ఎన్టీపీసీ పోలీసులను ఆశ్రయించి, తన గోడు వెలబోసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మాయలేడి కోసం దర్యాప్తు ప్రారంభించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి