Ayodhya : అయోధ్య వెళ్లే వారికి గుడ్‌ న్యూస్‌..మొదటి 100 రోజులు..1000 ట్రైన్లు!

అయోధ్య భవ్య మందిరం ప్రతిష్టాపన కార్యక్రమం జనవరి 22 న జరగనుంది. ఆ మరుసటి రోజు నుంచి భక్తులకు అనుమతినిచ్చిన క్రమంలో రైల్వేశాఖ తొలి 100 రోజులు కూడా 1000 ప్రత్యేక రైళ్లను అయోధ్యకు నడపనున్నట్లు తెలిపింది.

Ayodhya Ram Mandir : ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22నే ఎందుకు? ఈ తేదీ ప్రాముఖ్యత ఏంటి?
New Update

Ayodhya : వచ్చే ఏడాది జనవరి 22 న అయోధ్య(Ayodhya)  లో భవ్య రామ మందిరం ప్రతిష్ట మహోత్సవం జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా దగ్గర ఉండి చూసుకుంటున్నాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసే భక్తుల కోసం రైల్వే శాఖ  ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకోవడానికి వస్తుంటారు. అందుకే అయోధ్య కు మొదటి 100 రోజుల్లో 1000 రైళ్లను (Trains)నడపాలనుకుంటున్నా రైల్వేశాఖ ప్రకటించింది. వీటిని జనవరి 19 నుంచి ప్రారంభిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

రామమందిరం(Ram Mandir) ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిన మరుసటి రోజు నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతిస్తామని ఆలయాధికారులు ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలి వంద రోజుల పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణే, కోల్‌కతా, లక్నో, నాగపూర్‌, లక్నోతో పాటు జమ్మూ ప్రాంతాల నుంచి అయోధ్య కు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

భక్తుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటే ఈ 1000 కాకుండా అదనంగా కూడా రైళ్లను నడిపేందుకు అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. అందుకే అయోధ్యలోని స్టేషన్‌ ని పునరుద్దరించిన విషయం తెలిసిందే. అయోధ్య రామ మందిరం ప్రారంభం అయినప్పటి నుంచి సుమారు రోజు ఆలయానికి 50 వేల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ పనులన్నీ కూడా జనవరి 15 నాటికి పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. ఐఆర్సీటీసీ కూడా భక్తులు సందర్శిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని క్యాటరింగ్‌ సేవలను అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపడంతో పాటు డిమాండ్‌ ని బట్టి ఫుడ్‌ స్టాల్స్‌ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వివరించారు.

Also read: చిరంజీవి సినిమా.. ఆ క్యారెక్టర్ లో పవన్‌ కల్యాణ్‌!

#ayodhya #ram-mandir #special-trains
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe