DSC Postponement: డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలి.. హైకోర్టుకు నిరుద్యోగులు

TG: డీఎస్సీపై నిరుద్యోగులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షలు వాయిదా వేస్తూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని 10 మంది విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ పరీక్ష ప్రారంభమైంది. ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు కొనసాగనున్నాయి.

DSC Postponement: డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలి.. హైకోర్టుకు నిరుద్యోగులు
New Update

Telangana DSC Postponement: తెలంగాణలో డీఎస్సీ పరీక్ష ప్రారంభమైంది. డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. 10 మంది విద్యార్థులు హైకొర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరీక్షలు వాయిదా వేస్తూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. మరో వైపు ఈ రోజు నుండి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.

మొదలైన పరీక్ష..

తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ పరీక్ష ప్రారంభమైంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఆన్‌లైన్‌లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాల్లో పరీక్షను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు ఒక సెషన్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు మరో సెషన్‌ ఉంటుంది. కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు మాత్రం అరగంట ఎక్కువసేపు పరీక్ష ఉంటుంది.

అభ్యర్థులను ఉదయం 7:30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని విద్యాశాఖ తెలిపింది .అభ్యర్థులు పరీక్షకు పది నిమిషాల ముందు కేంద్రాలకు చేరుకోవాలని, ఆ తర్వాత అభ్యర్థులను అనుమతించబోమని వివరించింది. పరీక్షా కేంద్రాల్లోకి కాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, పేజర్లు, సెల్ ఫోన్లు, చేతి గడియారాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వ్యక్తిగత వస్తువులను అనుమతించబోమని ముందుగానే వివరించింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్, వ్యక్తిగత గుర్తింపు కార్డును తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం జరుగుతుంది.

పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. అలాగే పరీక్ష జరిగే కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఐదుగురికి మించి సమావేశం కాకూడదని అధికారులు సూచించారు. అలాగే పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్, ఇంటర్నెట్ షాపులను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు.

#dsc-exam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe