Barrelakka: బర్రెలక్క అలియాస్ శిరీష.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన శిరీష.. నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతానంటూ ఎన్నికల కథనరంగంలోకి దిగింది. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా.. బెదిరింపులకు పాల్పడినా వెనక్కి తగ్గలేదు సరికదా.. ఎట్లైతే అట్లైంది.. చూసుకుందాం పదా అని పోటీలో నిలిచింది. అయితే, పోలింగ్ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన శిరీష.. తాజాగా బయటకొచ్చి ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో సంచలన విషయాలు వెల్లడించింది.
తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదని వివరణ ఇచ్చింది. తన మిత్రులు ఒకరికి ప్రమాదం జరిగితే.. పరామర్శించడానికి వరంగల్‌కు వెళ్లినట్లు తెలిపింది శిరీష (Barrelakka Sirisha). అదే సమయంలో.. మరో సంచలన విషయాన్ని వెల్లడించింది శిరీష. తన అకౌంట్‌లో ఇప్పటివరకు రూ. 10 లక్షలు పడినట్లు తెలిపింది. ఏ అకౌంట్ నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? అనే వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పింది శిరీష. స్టేట్‌మెంట్స్ అన్నీ తీసిపెట్టుకున్నానని, రిజల్ట్స్ తరువాత మీడియాకు ఆ వివరాలన్నీ వెల్లడిస్తానని అన్నారు. ఇక మిస్సింగ్ అంటూ వస్తున్న వార్తలపై బర్రెలక్క ఆగ్రహం వ్యక్తం చేసింది. అదంతా తప్పుడు కథనాలు అని క్లారిటీ ఇచ్చింది. ఇక తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఓర్వలేని తనంతోనే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది బర్రెలక్క.
Also Read:
ఎప్పటికీ మా నాన్నే నా హీరో.. కవిత ట్వీట్ కు అర్థం అదేనా?
ఏపీలో వింత పంచాయితీ.. ఏపీలో రోడ్డుపైనే గోడ కట్టేసిన ప్రబుద్ధుడు