Air India: ఎయిర్‌ఇండియాకు మరోసారి షాక్.. భారీ ఫైన్ విధింపు.. ఎందుకంటే? సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎయిర్‌ఇండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) రూ.10లక్షల ఫైన్ విధించింది. రూల్స్ ఎందుకు పాటించలేదో సమాధానం చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. By Trinath 07 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Fine On Air India: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. ప్రయాణికుల సెఫ్టీ విషయంలో గతంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ఎయిర్‌ఇండియా(Air India)కు ఒకసారి గట్టి వార్నింగ్ ఇచ్చింది. అయినా కూడా ఎయిర్‌ఇండియాలో మార్పు వచ్చినట్లుగా కనిపించడంలేదు. విమానాల అంతరాయాలను ఎదుర్కొన్న ప్రయాణికులకు తగిన రక్షణ కల్పించడంలో ఎయిర్‌ఇండియా మరోసారి ఫెయిల్ ఐనట్లుగా తెలుస్తోంది. ఎయిర్‌ఇండియాకు DGCA షోకాజ్ నోటీసు జారీ చేసింది. పౌర విమానయాన అవసరాలు(CAR) ఉల్లంఘించినందుకు DGCA ఎయిర్ ఇండియాకు రూ.10 లక్షల జరిమానా విధించింది. ఏడాదిన్నర కాలంలో ఎయిర్‌ఇండియాకు ఫైన్ పడడం ఇది రెండోసారి. DGCA issues showcause notice to Air India for violation of DGCA Civil Aviation Requirement (CAR). Earlier, a fine of Rs 10 lakhs was imposed on the airline company for non-compliance of CAR. pic.twitter.com/TOXMdJ1aFZ — ANI (@ANI) November 7, 2023 రక్షణ లేదా? ప్రయాణికులకు అందించాల్సిన సౌకర్యాలకు సంబంధించిన నిబంధనలను పాటించనందుకు ఎయిర్ ఇండియాకు ఏవియేషన్ వాచ్‌డాగ్ షోకాజ్ నోటీసు జారీ చేయడం ఇది రెండోసారి కాదు ప్రయాణికులు నుంచి సంస్థపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎయిర్‌ఇండియాను గతంలో టాటా సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. విమానయాన సంస్థల తనిఖీల సమయంలో సెఫ్టీ నిబంధనలను ఎయిర్ ఇండియా పాటించడం లేదని DGCA గుర్తించింది. CAR నిబంధనలను ఎందుకు పాటించలేదో చెప్పాలని డీజీసీఏ ఎయిర్‌ఇండియాను అడుగుతోంది. రూల్స్ పాటించనందుకు రిప్లైను కోరింది DGCA. సమాధానం చెప్పాలంటూ ఎయిర్‌ఇండియాకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం. ఇలా అయితే ఎలా? ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్లలో ఇండియా ఒకటి. ఇటీవల కాలంలోదేశంలో దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ పెరుగుతోంది. చాలా మంది ట్రైన్ల కంటే విమానాల ద్వారా ప్రయాణం చేయాలని భావిస్తున్నారు. విమాన సర్వీస్‌లో ధరల తగ్గింపు ఉందని తెలిస్తే ట్రైన్ కంటే ప్లేన్ ద్వారానే ప్రయాణించాలని నిర్ణయించుకుంటున్నారు. టైమ్ సేవ్ అవుతుందని భావించడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రయాణికులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత సంస్థలదే. ఇప్పటికీ చాలా మందికి విమాన ప్రయాణలంటే భయం ఉంటుంది. మరోవైపు ప్రయాణికుల సెఫ్టీ విషయంలో విమాన సంస్థలు నిబంధనలు పాటించకపోతే DGCA కఠినంగా వ్యవహరిస్తోంది. CAR నిబంధనలు పాటించడం తప్పనిసరి. డీజీసీఏ రెగ్యులర్‌గా తనిఖీ చేస్తోంది. గతేడాది కూడా ఎయిర్‌ఇండియాపై సీరియస్ అయ్యారు ఎవియేషన్ అధికారులు. గతంలోనూ విమానాశ్రయాలలో ఇదే విధమైన తనిఖీలు చేశారు. అప్పుడు కూడా CAR నిబంధనలు ఉల్లంఘించింది ఎయిర్‌ఇండియా. ప్రయాణీకులను బోర్డింగ్ నిరాకరించింది. దీంతో ఎయిర్‌ఇండియాకు అప్పడు కూడా రూ. 10 లక్షల జరిమానా విధించారు. Also Read: ఇజ్రాయెల్‌కు లక్ష మంది భారతీయ కార్మికులు.. ఎందుకో తెలుసా? WATCH: #latest-news #air-india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి