Srisailam: శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు అధికారులు. ఇన్ ఫ్లో 4,50,064 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 5,22,318 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 882.20 అడుగులు వద్ద ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 200.1971 టీఎంసీల నీరు ప్రాజెక్ట్ లో ఉన్నాయి.
శ్రీశైలాన్నీ చూసేందుకు..
శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో దానిని చూసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. వీకెండ్ కావడంతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్ట్ కు చేరుకునేందుకు గంటల కొద్దీ సమయం పడుతోంది. కాగా మేడ్చల్ జిల్లాలో విషాదం నెలకొంది. శ్రీశైలం ఘాట్ రోడ్డులో వటువర్లపల్లి సమీపంలో అర్ధరాత్రి జరిగిన కారు ప్రమాదంలో మేడ్చల్ జిల్లా బొల్లారానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. వాహనం అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొనండంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది