దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది.. జనసేనపై సజ్జల ఫైర్..!

New Update
దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది.. జనసేనపై సజ్జల ఫైర్..!

It is as if the devils have caused the Vedas.. Sajjala fire on Janasena

వాళ్లకువాళ్లే ప్రకటనలు

రాష్ట్ర ప్రయోజనాలతో పాటు...రాజీ లేకుండా అన్ని విషయాల్లో కేంద్రంతో మాట్లాడుతుమన్నారు. సీఎం జగన్ ఒక్కరే కేంద్రంతో బ్యాలన్స్‌గా వ్యవహరిస్తున్నారని చాలా రాష్ట్రాలు చెప్పుకుంటున్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు అన్నారు. టీడీపీకి అసలు ఒక ఐడెంటిటీ స్టాండ్ ఉందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు...ఆయన దత్తుడు వాళ్లకు వాళ్లే కొన్ని ప్రకటనలు చేస్తారని అన్నారు. 2014లో ఏమి చెప్తున్నారో ఇప్పుడు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

జగన్‌పై నమ్మకం ఉంది

అసలు టీడీపీ మ్యానిఫెస్టోకు సంబంధించి ఎక్కడైనా చర్చ ఉందా అని ప్రశ్నించారు. రుణమాఫీ హామీ ఇచ్చి చంద్రబాబు ఏమి చేశారో ప్రజలు తెలుసు అన్నారు. సీఎం జగన్‌ అసాధ్యమైన హామీలు మీలాగా ప్రజలకు ఇవ్వలేదన్నారు. అధికారం కోసం జగన్ అడ్డదారులు తొక్కడు. చెప్పిందే చేస్తారనే నమ్మకం జగన్‌పై ఉంది...ఇప్పుడు ఇది నిజమైదన్నారు. చెప్పిందే చెప్పే అబద్ధం చంద్రబాబు చెబుతున్నాడని..ఎన్డీయేలోకి పిలవాలి అనుకుంటే వాళ్ళ ఇష్టం.. వెళ్ళాలి అనేది టీడీపీ ఇష్టం అన్నారు. వెళ్లాలనే ప్రయత్నంలో టీడీపీ ఉంది.. ఆ తపన టీడీపీలో ఉందన్నారు. ఎన్నికలు వస్తే ఎదో హడావిడి చేస్తే ప్రజలు పట్టించుకోరని.. జగన్ ఏమి చేస్తారనేదానిపై ఒక స్పష్టత ఉందన్నారు.

ఘనంగా జయంతి వేడుకలు 

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌ను తెలుగు ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని, ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్‌ పరిపాలిస్తున్నారని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కేక్‌ కట్‌ చేసి వేడులకు ప్రారంభించారు.వైఎస్సార్‌ ఇప్పుడు సీఎం జగన్‌ రూపంలో ఉన్నారని, ఆయన ప్రతి లక్షణాన్ని సీఎం జగన్ పుణికిపుచుకున్నారని సజ్జల అన్నారు. ఈ రోజు ప్రతి కార్యకర్త గర్వంగా జగనన్న మనుషులం అని చెప్పుకునే విధంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. వైఎస్సార్‌ ఆత్మ శాంతి కలిగేలా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఈ తరానికి సీఎం జగన్‌ తండ్రి వైఎస్సార్ అని గర్వంగా చెప్పుకునేలా పాలిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు.

రాజన్న అంటేనే మనసున్న మారాజు..

ఏపీ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలుపుతున్నారు. జగనన్న సురక్షతో ప్రతి ఇంటికి వెళ్లి అక్కడికక్కడే సమస్య పరిష్కరిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యంత వేగంగా సమస్య కి పరిష్కారం చూపిస్తున్నారు. వైఎస్సార్ దార్శనికతను ఈరోజు సీఎం జగన్ ఆచరణలో చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఏ సర్వే చేసిన 70 నుండి 80 శాతం మంది జగనన్నే కావాలని ప్రజలు చెప్తున్నారు. చంద్రబాబు ఒక్కటి కూడా చెప్పుకోవడానికి లేదు. 2014-19 మధ్య డీటీపీ ఏం చేసాడో చంద్రబాబు చెప్పుకోలేని పరిస్థితి. అన్ని వ్యవస్థలను సీఎం రిపేర్ చేసి దేశానికి ఆదర్శంగా మలిచారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

Advertisment
తాజా కథనాలు