రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతా.. వెనక్కు తగ్గని జీవన్ రెడ్డి!

రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతా.. వెనక్కు తగ్గని జీవన్ రెడ్డి!
New Update

జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లి బుజ్జగించినా ఆయన మెత్తబడడం లేదు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. అయితే.. పార్టీ మారనని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతానని ఆయన చెబుతున్నారు. ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకుంటానని స్పష్టం చేస్తున్నారు. తన ప్రమేయం లేకుండానే జరగాల్సింది జరిగిందని ఎమ్మెల్యే సంజయ్ చేరికపై ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. రాజీనామా కోసం మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అపాయింట్మెంట్ కోరానని.. ఆయన అనుమతి ఇవ్వగానే రాజీనామా చేస్తానని మరోసారి స్పష్టం చేశారు.

జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 2004-09 మధ్య కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా రెండు సార్లు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ రెండు సార్లు పార్టీ ఆదేశాలతో జీవన్ రెడ్డి కేసీఆర్ పై బరిలోకి దిగారు. అనంతరం 2009 ఎన్నికల్లో ఓటమి పాలైనా.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. జగిత్యాల నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉండడంతో.. అప్పటి ఎంపీ కవిత ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. డా.సంజయ్ ను ఇక్కడి నుంచి బరిలోకి దించి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు.

దీందో 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ చేతిలో జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే.. 2018 ఎన్నికల్లో ఓడిపోయినా.. ఆ తర్వాత వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగి అనూహ్య విజయం సాధించారు. అయితే.. 2023లో ఓటమి పాలైన తర్వాత జీవన్ రెడ్డిని నిజామాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించింది. ఆ ఎన్నికల్లోనూ ఆయన ఓటమి పాలయ్యారు.

రెండు రోజుల క్రితం జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి జీవన్ రెడ్డి పార్టీపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తనకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా.. తన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేను ఎలా చేర్చుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా.. పార్టీలో కొనసాగితే తనకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe