ఇంటిలోని వ్యక్తిని జాగ్రత్తగా చూసుకుంటుందన్న ఉద్దేశంతో పనిలో పెట్టుకుంటే..మిమ్మల్ని కేసులో ఇరికిస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది ఓ మహిళ. ఇది ఎవరో సాధారణ వ్యక్తినో, కుటుంబాన్నో కాదు..క్రికెటర్ యువరాజ్ సింగ్ కుటుంబాన్ని. యువీ తల్లి షబ్నామ్ కొంత కాలం క్రితం తన మరో కుమారుడు జోరావర్ కోసం హేమా కౌశిక్ అనే మహిళను కేర్ టేకర్ గా నియమించుకుంది.
పనిలో చేరిన హేమా ముందు బాగానే ఉన్నప్పటికీ.. కొంత కాలం తర్వాత నుంచి షబ్నామ్ ను బెదిరించడం మొదలు పెట్టింది. తప్పుడు కేసులో ఇరికిస్తానని, కుటుంబ పరువు దెబ్బ తీస్తానంటూ అలా చేయకుండా ఉండాలంటే..రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ముందుగా రూ.5 లక్షలు ఇవ్వాలని బెదిరించింది.
వాటిని మొదట్లో వాటిని షబ్నామ్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ హేమ వేధింపులు ఎక్కువ కావడంతో పరిస్థితి గురించి షబ్నామ్ యువీకి తెలిపింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితురాలి కోసం సుమారు 20 రోజుల పాటు గాలింపు చేపట్టారు.
డబ్బులు ఇస్తామని ఆ మహిళను ట్రాప్ చేసి పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీని గురించి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.