ఈ రెండు సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే.. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్. ఈ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమా ఏదైనా.. హీరో ఎవరైనా.. థమన్ వాయించడం మొదలు పెట్టాడంటే.. బాక్సాఫీస్ బద్దలవడం గ్యారంటీ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ రెండు సినిమాల మ్యూజిక్ ఎలా ఉండబోతుందో ఎస్ థమన్ తన మాటల్లో చెప్పాడు. బ్రో సినిమా కోసం ఓ మ్యూజికల్ ప్రమోషనల్ సాంగ్‌ను రెడీ చేసినట్టు చెప్పాడు.సినిమా ఎండింగ్‌లో ఈ సాంగ్ వస్తుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ పాటను ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టాడు.
ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్న థమన్
మరోవైపు గుంటూరు కారం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ పనులు కొనసాగుతున్నాయని, అవుట్‌పుట్ ఇంప్రెసివ్‌గా వచ్చిందన్నాడు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేసేలా కంప్లీట్ ప్యాకేజీలా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ఉండబోతుందని చెప్పి ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. గుంటూరు కారం చిత్రాన్ని వచ్చే ఏడాది 2024 జనవరి 13న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
హల్‌చల్ చేస్తోన్న ఫస్ట్ సింగిల్ మై డియర్
ఇప్పటికే బ్రో నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ మై డియర్ మార్కండేయ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. సముద్ర ఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. బ్రో ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీతో పాటు భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచేస్తున్నాయి. ఈ మూవీలో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందిస్తున్నారు. ఈ మూవీ జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.