AP: ప్రోటోకాల్ వివాదం.. అధికారులపై ZPTC సీరియస్..!

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు తమను పిలవలేదని వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆరోపించారు. అధికారులు తమ తీరు మార్చుకొక పోతే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

New Update
AP: ప్రోటోకాల్ వివాదం.. అధికారులపై ZPTC సీరియస్..!

Also Read: అందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయి: మంత్రి సంధ్యారాణి

ఇటీవల మండలంలో జరిగిన ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఏన్ ఆర్ ఇ జి ఎస్, ఆర్టీసీ సంస్థల పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు జంగారెడ్డిగూడెం జడ్పిటిసి అయిన తనను, అదేవిధంగా ఎంపీపీ, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలను ఆహ్వానించడం లేదని మండిపడ్డారు.

అధికారులు ప్రోటోకాల్ నియమాలను పాటించకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకొక పోతే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని జంగారెడ్డిగూడెం జడ్పిటిసి పోల్నాటి బాబ్జి హెచ్చరించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు