Edelweiss: ఆ సీఈవో అలా ఎందుకన్నారు?.. మ్యూచువల్ ఫండ్స్ కు వాటితో పోటీనా!

స్విగ్గీ, జొమాటో, నెట్‌ఫ్లిక్స్‌తోనే తమకు పోటీ అన్నారు ఎడిల్‌విస్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ సీఈవో, ఎండీ రాధికా గుప్త. ఆయా ఓటీటీ ప్లాట్ ఫాంలకు దేశంలో 40కోట్ల మంది వినియోగదారులుండగా, మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపీ విధానంలో మాత్రం నాలుగు కోట్ల మందే కస్టమర్లున్నారని వ్యాఖ్యానించారు.

Edelweiss: ఆ సీఈవో అలా ఎందుకన్నారు?.. మ్యూచువల్ ఫండ్స్ కు వాటితో పోటీనా!
New Update

Edelweiss - Radhika Gupta: ‘‘మాకు స్విగ్గీ, జొమాటో, నెట్‌ఫ్లిక్స్‌తోనే పోటీ...’’ ఈ మాట అన్నది ఎవరో ఫుడ్ డెలివరీ యాప్ ఓనర్ కాదు, ఎడిల్‌విస్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ సీఈవో, ఎండీ రాధికా గుప్త. ఓ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థను నడిపిస్తున్న ఆమె అలా ఎందుకంటారని ఆశ్చర్యపోతున్నారా?

కాలం కలిసొచ్చినప్పుడే నాలుగు రాళ్లు వెనకేయాలంటారు పెద్దలు. ఇప్పుడైతే అనేక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫాంలు అందుబాటులోకి వచ్చాయి. చిన్నదైనా సరే.. నెలనెలా కొంత మొత్తాన్ని ఎస్ఐపీ విధానంలో పొదుపు చేయాలని చాలా మంది సలహాలిస్తుంటారు. అయితే, దేశంలో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఆ విధానంలో పెట్టుబడి పెడుతున్న వారి సంఖ్య నాలుగు కోట్లుగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె పై వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: ఉరకలేస్తున్న యువ రక్తం.. చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు!

బాంబే షేవింగ్‌ కంపెనీ ఫౌండర్ శంతనూ దేశ్‌పాండే ‘ది బార్బర్‌షాప్‌ విత్‌ శంతనూ’ పేరుతో నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో రాధికా గుప్త పాల్గొని మాట్లాడారు. నెలకు రూ. 50వేలు సంపాదించే వారు వంద రూపాయాలు కూడా పొదుపు చేయలేకపోతున్నారని; కానీ నెట్ ఫ్లిక్స్ కోసమైతే నెలకు వంద రూపాయలు టంచనుగా ఖర్చు చేస్తారని ఆమె వ్యాఖ్యానించారు. దేశంలో ఓటీటీ ప్లాట్‌ఫాంలు, స్విగ్గీ, జొమాటోకు 40 కోట్ల మంది వినియోగదారులుండగా, మ్యూచువల్‌ ఫండ్స్‌ కు మాత్రం నాలుగు కోట్ల మందే కస్టమర్లు ఉన్నారని వెల్లడించారు. అందుకే స్విగ్గీ, జొమాటోతోనే తమకు పోటీ అని రాధిక గుప్త చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: టీమిండియాకు సఫారీల సవాల్‌.. తొలి టీ20కు ప్లేయంగ్‌ టీమ్‌ ఇదే!

ఇప్పుడు ఆదాయాలు పెరిగాయని, కానీ ఈ తరానికి పొదుపు ఆలోచన పెద్దగా కనిపించడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయంలో ఎంతో కొంత తప్పకుండా పొదుపు చేయాలని సూచించారు.

#radhika-guptha #edelweiss
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe