Zomato CEO Marriage: మెక్సికో మోడల్ తో జొమాటో సీఈవో సీక్రెట్ మ్యారేజ్.. హనీమూన్ తర్వాత ఎక్కడ ఉన్నారంటే.. 

జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ మెక్సికో మోడల్ గ్రేసియా మునోజ్ ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు జాతీయ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాకా ఇటీవలే హనీమూన్ ముగించుకుని దీపిందర్ దంపతులు భారత్ వచ్చారని తెలుస్తోంది. 

Zomato CEO Marriage: మెక్సికో మోడల్ తో జొమాటో సీఈవో సీక్రెట్ మ్యారేజ్.. హనీమూన్ తర్వాత ఎక్కడ ఉన్నారంటే.. 
New Update

Zomato CEO Marriage: జొమాటో వెజ్ డ్రెస్ వివాదం మధ్య ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం సీఈవో దీపిందర్ గోయల్ రహస్యంగా వివాహం చేసుకున్నారనే వార్త ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. దీపీందర్ రెండు నెలల క్రితం మెక్సికన్ వ్యాపారవేత్త గ్రేసియా మునోజ్‌ను రహస్యంగా వివాహం (Zomato CEO Marriage)చేసుకున్నారు. దీపిందర్ గోయల్, గ్రేసియా మునోజ్ తమ హనీమూన్ నుండి ఫిబ్రవరిలోనే భారత్ తిరిగి వచ్చారు. ఈ విషయాన్ని మునోజ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ ద్వారా నిర్ధారణ చేస్తున్నారు. మునోజ్ తన పోస్ట్ లో  తాను మెక్సికోలో జన్మించానని, ఇప్పుడు భారతదేశంలోనే ఉన్నానని పేర్కొన్నారు. కొన్నిరోజుల క్రితం  గ్రేసియా భారత రాజధాని ఢిల్లీని సందర్శించడానికి వచ్చింది.  ఆ సమయంలో ఆమె Zomato CEO తో ప్రేమలో పడింది.  చాలా కాలం డేటింగ్ చేసిన తర్వాత, వారిద్దరూ వివాహం (Zomato CEO Marriage) చేసుకున్నారు. 

జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. దీపీందర్ - గ్రేసియా ఇద్దరికీ బాగా తెలిసిన వ్యక్తి ఈ విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. దీపిందర్ - గ్రేసియా ఒక నెల క్రితం వివాహం(Zomato CEO Marriage) చేసుకున్నారని ఈ వ్యక్తి చెప్పాడు. దీపిందర్ గోయల్ భార్య గ్రేసియా మునోజ్ మాజీ మోడల్, ఆమె ఇప్పుడు తన స్వంత లగ్జరీ ఉత్పత్తుల స్టార్టప్‌లో పని చేస్తోంది. వివాహం తరువాత ఆమె మోడలింగ్ మానేసిందని తెలుస్తోంది. 


ఎవరీ గ్రేసియా మునోజ్..
జనవరిలో, మునోజ్ ఢిల్లీలోని ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శించారు.  ఆ పర్యటన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ బయో ప్రకారం, గోయల్ రెండవ వివాహం 2022లో అమెరికా మెట్రోపాలిటన్ ఫ్యాషన్ వీక్ విజేత మునోజ్‌తో జరిగింది. 

Also Read: ఇది మామూలు స్పీడ్ కాదు.. ఒక్క నిమిషంలో 90 సినిమాలు డౌన్‌లోడ్.. 

దీపీందర్ జొమాటో కథ ఇదీ.. 
Zomato CEO Marriage: గురుగ్రామ్‌కు చెందిన దీపిందర్ గోయల్, 41, కన్సల్టింగ్ సంస్థ బైన్ & కంపెనీలో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తర్వాత 2008లో రెస్టారెంట్ అగ్రిగేటర్ - ఫుడ్ డెలివరీ కంపెనీ Zomato (అప్పుడు Foodiebay.com) సహ-స్థాపించారు. ఈ వారం, గోయల్ - జొమాటోలు “ప్యూర్ వెజ్ మోడ్” - “ప్యూర్ వెజ్ ఫ్లీట్” కోసం వార్తల్లో ఉన్నాయి. శాఖాహార ఆహారాన్ని మాత్రమే డెలివరీ చేయడానికి ప్రత్యేక గ్రీన్ యూనిఫాం ఉంచాలని ఆయన చేసిన ప్రయోగం వికటిచింది. విమర్శల పాలైంది.

వెజ్ డ్రెస్ కోడ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు
Zomato CEO Marriage: గోయల్ బుధవారం తన డెలివరీ ఏజెంట్లు గ్రీన్ బాక్స్‌ల కోసం గ్రీన్ డ్రెస్ కోడ్ ప్లాన్‌ను ఉపసంహరించుకుంటారని, డెలివరీ ఏజెంట్లందరూ ఇప్పటికే ఉన్న రెడ్ షర్టులు లేదా టీ-షర్టులను ధరించడం కొనసాగిస్తారని చెప్పారు. దాదాపు మూడు సంవత్సరాల క్రితం జొమాటో బ్లాక్‌బస్టర్ లిస్టింగ్ తర్వాత, గోయల్ భారతదేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, జోమాటోలో ఆయన షేర్స్  ఆధారంగా దీపీందర్ నికర విలువ $650 మిలియన్లుగా అంచనా వేశారు. 

#zomato #tending-stories
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe