Heath Streak: జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ చనిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన ఒలంగా

జింబాబ్వే దిగ్గజ క్రికెటర్‌ హీత్ స్ట్రీక్ బతికే ఉన్నారు. స్ట్రీక్ మరణించలేదని.. కొద్దిసేపటి క్రితమే తనతో మాట్లాడినట్లు సహచర ఆటగాడు హెన్రీ ఒలంగా స్పష్టంచేశాడు. దీంతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

New Update
Heath Streak: జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ చనిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన ఒలంగా

Heath Streak not dead: ఉదయం నుంచి జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ మరణించారనే వార్త క్రికెట్ అభిమానులను ఆవేదనకు గురిచేసింది. స్ట్రీక్ ఆత్మకు శాంతి కలగాలని చెబుతూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ పోస్టులు కూడా చేస్తున్నారు. అయితే ఇంతలోనే ఓ హ్యాపీ న్యూస్ బయటకు వచ్చింది. స్ట్రీక్ బతికే ఉన్నారని.. ఆయన మరణించలేదని సహచర ఆటగాడు హెన్రీ ఒలంగా క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశాడు. ‘హీత్ స్ట్రీక్ చనిపోయాడన్న పుకార్లు మరీ ఎక్కువయ్యాయి. నేను ఇప్పుడే అతడితో మాట్లాడాను. మూడో అంపైర్ అతడిని మళ్లీ వెనక్కి పిలిచాడు. స్ట్రీక్ బతికే ఉన్నాడు అంటూ ట్విట్టర్‌లో తెలిపాడు. ఈ ట్వీట్‌కు స్ట్రీక్ తో చేసిన వాట్సాప్ చాట్ కూడా షేర్ చేశాడు.

గత కొంతకాలంగా పేగు, కాలేయ సంబంధ క్యాన్సర్‌తో బాధపడుతూ దక్షిణాఫ్రికాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు స్ట్రీక్‌. ఈ క్రమంలో స్ట్రీక్ మరణించారని ఒలంగానే ఉదయం ట్వీట్ చేశాడు. ఇప్పుడు మళ్లీ తానే స్ట్రీక్ బతికి ఉన్నారని మరో ట్వీట్ చేశాడు. మరో ఆటగాడు సీన్ విలియమ్స్ కూడా ట్వీట్ చేశారు. ‘మీరు, మీ కుటుంబ సభ్యులు నాకు ఎంత సహాయం చేశారో చెప్పేందుకు తనకు మాటలు రావడం లేదని తెలిపాడు. దీంతో అభిమానులు ఒలంగా తీరుపై మండిపడుతున్నారు. నిజనిజాలు తెలుసుకోకుండా ఇలాంటి సెన్సిటివ్ విషయాలు గురించి ఎలా ట్వీట్ చేస్తారని మండిపడుతున్నారు.

జింబాబ్వేలోని అత్యుత్తమ క్రికెటర్లలో హిత్ స్ట్రీక్ (Heath Streak)ఒకరు. 1993లో పాకిస్థాన్‌ జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ సిరీస్‌లో రవల్పిండిలో జరిగిన రెండో మ్యాచ్‌లోనే ఎనిమిది వికెట్లు పడగొట్టి సత్తా చాటారు. 2000 నుంచి 2004 మధ్య జింబాంబ్వే జట్టుకు (Zimbabwe) ఆయన కెప్టెన్‌గా వ్యవహరించారు. సుమారు 12 సంవత్సరాల పాటు ఆయన జింబాంబ్వే జట్టుకు సేవలందించారు. కెరీర్‌లో మొత్తం 65 టెస్టులు, 189 వన్డేలు ఆడారు. ఎన్నో మ్యాచుల్లో జింబాంబ్వేకు ఆయన ఒంటి చేత్తో విజయాలు సాధించి పెట్టారు. జింబాంబ్వే తరఫున టెస్టుల్లో 100 వికెట్లు సాధించిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా టెస్టుల్లో 1990 పరుగులు, వన్డేల్లో 2943 పరుగులు చేశారు. టెస్టుల్లో ఆయన అత్యధిక స్కోర్ 127 (నాటౌట్) విండీస్ జట్టుపై చేశారు. రిటైర్మెంట్ తర్వాత జింబాబ్వే, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టులకు కోచ్‌గా పనిచేశారు.

Also Read: లెఫ్ట్‌ ఏంది రైట్‌ ఏంది.. హ్యాండ్‌తో పనేంటి..? రవిశాస్త్రిపై గంభీర్‌ ఫైర్‌ !

Advertisment
తాజా కథనాలు