జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ ల సిరీస్‌ను ఇండియా 3-1 తేడాతో మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా 15.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
భారత్ బ్యాటింగ్ యశస్వి జైస్వాల్ (93 నాటౌట్; 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (58 నాటౌట్; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు పరుగులు చేశారు. ఆఖరి 5వ టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది.
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్లు మధెవర్ (25), మరుమాని (32) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ సికిందర్ రజా (46; 28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2, సుందర్, శివమ్ దూబె, అభిషేక్ శర్మ, తుషార్ దేశ్‌పాండే తలో వికెట్ తీశారు.